హ్యాపీ అండ్ సక్సెస్: ఇదీ సియాటెల్ జనసేన గర్జన

December 4, 2018 | News Of 9

Seattle janasena garjana a great success | Newsof9

సియాటెల్: జనసేన అంటేనే ఒక సమ్మోహనం. అది ఇక్కడైనా, ఎక్కడైనా! డిసెంబరు ఒకటో తేదీన సియాటెల్ లో నిర్వహించిన ప్రవాస గర్జన విజయవంతం అయింది. దాదాపు 500 మంది ఎన్నారైలు ఈ సమావేశానికి హాజరుకాగా, అందులో 100 మంది వరకూ వీర మహిళలు ఉన్నారు. పార్టీ సిద్ధాంతల గురించి చెప్పడంతోపాటు మధ్య మధ్యలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. రఘురామ్ చక్కటి తన గొంతుతో పాటలు పాడగా, ఆది నాయుడు చేసిన స్టాండప్ కామెడీ నవ్వులు పండించింది. త్రినాథ్ చేసిన జనపథం స్కిట్ ఆకట్టుకునే విధంగా సాగడం విశేషం. జనసేన వలంటీర్ దిలీప్ సుంకర హైదరాబాదు నుంచి ఆన్ లైన్ ద్వారా ఇక్కడ సియాటెల్ లో ఉన్నవారితో కాన్ఫరెన్సులో ఇక్కడున్న వారితో మాట్లాడారు. సోషల్ మీడియా స్టార్, పవన్ కళ్యాణ్ వీరాభిమాని విష్ణు నాగిరెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు తన సందేశాన్ని ఇచ్చారు. జనసేన గర్జన సందర్భంగా జనసేన పార్టీపై గాయకుడు రఘురామ్ స్వరపరిచిన పాటను కూడా విడుదల చేశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ వీడియో సందేశం ద్వారా సియాటెల్ గర్జన సమావేశానికి అభినందనలు తెలిపారు. అలాగే, డల్లాస్ ప్రవాస గర్జనను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. జనసేన సియాటెల్ గర్జనకు హాజరైన వారందరికీ రుచి, స్వాగత్, హైదరాబాదీ హౌజ్, కేఫ్ బహార్, విరుంధు, బావార్చీ లు భోజనాది పదార్ధాలను ఉచితంగా అందించినందుకు వారికి నిర్వాహకులు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *