పిచ్ మీదైనా… మ్యాచ్ మాదే !!

February 9, 2019 | News Of 9

Shutup, We give you The PM | telugu.newsof9.com

  • గడ్కరీని తెరపైకి తెస్తూ యల్లో మీడియాలో కథనాలు
  • ప్రజల గొంతులో ‘‘హిజ్ మాస్టర్స్ వాయిస్’’
  • తెలుగు ప్రజల పరిస్థితికి అద్దం పడుతున్న బ్రాహ్మణుడు-మేక కథ
  • ఉక్కిరి బిక్కిరి అవుతున్న భాజపా నేత గడ్కరీ?
  • అసెంబ్లీలో చంద్రబాబు నవ్వులకు అర్థం అదేనా?

అమరావతి: నితిన్ గడ్కరీ… ఈ పేరు ఇప్పుడు తెలుగుదేశం వర్గాలకూ, కాంగ్రెసు వర్గాలకూ ఎంతో ఇష్టమైన పేరుగా మారిపోయింది. నిరంకుశపాలన అనీ, నియంత పోకడలు పోతున్నాడనీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీపై యుద్ధం ప్రకటించిన కోస్తాంధ్ర పెట్టుబడిదారులు కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ‘‘సరే, భారతీయ జనతా పార్టీతో మాకు సమస్యలేమీ లేవు… ఉన్నదల్లా మోడీ, అమిత్ షా ద్వయంతోనే’’ అని వారు సందేశం పంపుతున్నారు. ఆ దుష్ట ద్వయాన్ని తీసేస్తే… భాజపాతో మాకు ఎలాంటి ఇబ్బందీలేదని వారు బాహాటంగా స్పష్టం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… గడ్కరీ గురించి చాలా ఉల్లాసంగా మాట్లాడారు. గడ్కరీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు ముఖంలో కొత్తగా నవ్వు తన్నుకు వస్తోంది. కుటుంబాన్ని సరిగా చూసుకోలేని వ్యక్తి దేశాన్ని ఏం పరిపాలిస్తాడంటూ కార్యకర్తల్ని ఉద్దేశించి నాగపూర్ లో జరిగిన భాజపా విద్యార్ధి విభాగం సమావేశంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్ర మోడీకి ఆపాదించి.. చంద్రబాబు అసెంబ్లీలో వికట్టాట్టహాసం చేశారు. కార్యకర్తలు కుటుంబాలను పట్టించుకోకుండా దేశానికి సేవ చేస్తామని చెబుతుంటారని, ముందు సొంత కుటుంబాన్ని సంరక్షించుకుని, అనంతరమే దేశ సేవ లేదా పార్టీ సేవ చేయాలని గడ్కరీ అన్నారు. అయతే తెలుగుదేశం వర్గాలు దీనిని ప్రధాని నరేంద్ర మోడీకి ఆపాదించాయి. ప్రధాని నరేంద్ర మోడీకి కుటుంబంలేని విషయం తెలిసిందే. నిజానికి కుటుంబంలేని వ్యక్తి లక్షలు కోట్లు తీసుకున్నా.. ఏం చేయాలి అన్నది ప్రశ్న. కోస్తా జిల్లాల పెట్టుబడిదారుల్లో ఒక సంప్రదాయం ఉంది. వారికి ఒక్క కూతురు లేదా ఒక్క కొడుకు ఉంటే ఆపరేషన్ చేయించేసుకుంటారు. ఉన్న ఒక్క పిల్లవాడికే తల్లిందండ్రుల ఆస్తి రావాలి, పిల్లవాడు పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారు ఇచ్చే ఆస్తి రావాలి. ఈ రెండింటికీ వాళ్లకు పుట్టే బిడ్డ మాత్రమే వారసుడు కావాలి. అందుకోసం వ్యాపారాలు చేసి, రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించి ఉన్న ఒక్క కొడుకునీ లక్షల కోట్లకు అధిపతిని చేస్తారు. ఈ సంప్రదాయం దేశంలో మరే ఇతర కుటుంబాల్లో కనిపించదు. వీళ్లతో పోల్చితే కుటుంబం లేకుండా కేవలం పార్టీ కోసమో, ప్రజల కోసమో, దేశం కోసమో పని చేసేవాళ్లు ఎంత నయం చెప్పండి. బ్రహ్మచారిగా ఉండి.. విలువలకు కట్టుబడి వచ్చిన జీతంతోనే బతికే వారు ఎంత మంది ఉంటారు చెప్పండి? ఇవీ వాస్తవాలు.

నా పేరు చెబితే వణకాల్సిందే: మోడీ 

మొన్న పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘‘నేను మీకు హామీ ఇస్తున్నాను. అవినీతి పరులు నరేంద్ర మోడీ పేరు చెబితే భయపడుతూనే ఉంటారు’’ అని నొక్కి వక్కాణించి మరీ చెప్పారు. దీని అర్థం చంద్రబాబుతోపాటు అంటకాగుతున్న పెట్టుబడిదారుల సంగతి మరోసారి చూడటమేనని అనుకోవచ్చా.? ఏమో ఇప్పుడే చెప్పలేం. అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏమైనా సర్దుబాట్లు జరిగాయేమో తెలియదు.

సరే, గడ్కరీ విషయానికి వస్తే… కోస్తాంధ్ర పెట్టుబడిదారులు నరేంద్రమోడీని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారనేది సుస్పష్టం. తెరవెనుక మంతనాలూ జగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి పదవి ఇస్తానంటే వద్దనే చవట ఎవడు ఉంటాడు చెప్పండి? జీవితంలో అలాంటి అవకాశం ఎప్పుడో గానీ రాదు. ప్రణబ్ ముఖర్జీ వంటి సీనియర్ నేత ప్రధాని కావాలని బలంగా కోరుకున్నా… ఆయన కాలేకపోయారు. బదులుగా ఆయనకు రాష్ట్రపతి పదవినిచ్చి, మొన్నటికి మొన్న భారతరత్న కూడా ఇచ్చి సంతృప్తి పరిచారు. ఢిల్లీ రాజకీయాలు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు బనియా-బ్రాహ్మణ వర్గాల చేతిలో ఉంటాయి. (బ్రాహ్మణులను సంతృప్తి పరిచేందుకే ప్రణబ్ దాకు భారత రత్న ఇచ్చారన్న గుసగుసలు అక్కడక్కడా వినిపించక పోలేదు). భాజపా కురువృద్ధుడు అద్వానీ ప్రధాన మంత్రి పదవికి అన్ని అర్హతలూ ఉన్న వ్యక్తి. సీనియర్ రాజకీయవేత్త, ఉత్తమ పార్లమెంటేరియన్ కూడా. అయినా ఆయనకు అవకాశం రాకపోవడానికి కారణం.. ఆయన బనియాగానీ, బ్రాహ్మణగానీ (అద్వానీ సింధీ) కాకపోవడమేనన్నది ఢిల్లీ వీధుల్లో బహిరంగ రహస్యమే.

అద్వానీకి అన్ని అర్హతులున్నా ప్రధాని పదవి దూరమైపోయింది. గడ్కరీని సాక్షాత్తూ ప్రధాని పదవి వరించి వస్తే… వద్దని ఆయన ఎందుకంటారు? లోలోన సంతోషాన్ని పట్టలేక ఉక్కిరిబిక్కిరి కూడా అయిఉంటారు. కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు ప్రధాని పదవిపై పెద్దగా ఆశలేదు. ఉన్నోడు… ఎవడైనా మనోడుగా ఉంటే చాలన్న చిన్న కోరిక మాత్రమే వారిది. సీబీఐ, ఈడీలూ తమ జోలికి రాకుండా ఉంటే అదే పదివేలు అన్నది మన తెలుగు పెట్టుబడిదారుల కోరిక.

దేశంలో ముఖ్యమంత్రులంతా… వారి వారి రాష్ట్రాల్లో పాలనాపరమైన పనులు చూసుకుంటూ ఉంటే మన సీఎంలకు ఓపిక మహా జాస్తి. ఉదయం శ్రీకాకుళంలో కార్యక్రమంలో పాల్గొంటారు. దారిలో టెలికాన్ఫరెన్సు నిర్వహిస్తారు. విజయవాడలో విమానం ఎక్కి… కోల్ కతా వెళ్లి మమతా బెనర్జీతో మాట్లాడతారు. రాత్రికి సొంత వ్యవహారాల గురించి చర్చించుకుంటారు. డబ్బుకు మన కోస్తా పెట్టుబడిదారులు ఇచ్చిన విలువ ఎవరూ ఇవ్వరు. 24 గంటలూ వారికి ఇష్టమైన పని ఇదే. రోజుకు ఇంకో 24 గంటలు ఉండే ఎంత బాగుండును అని ఆలోచిస్తారు.

భాజపాకీ, తెలుగుదేశం పార్టీకీ సంబంధం లేకపోయినా, రెండూ బాహాబాహీ కొట్టుకుంటున్నా… ఎదుటి పార్టీని ప్రభావితం చేసి కొత్త ప్రధానిని ప్రతిపాదించే సాహసం.. అర్థం చేసుకోవాలి. అలాంటిది వారికి ఆంధ్ర సీఎం పదవి పెద్ద పదవి కానే కాదు. అందుకే ఓటర్ల జాబితాలను మార్చేస్తున్నారు. మీరు ఓట్లు వేస్తే సరి… లేదంటే మీ ఓటు జాబితాలో ఉండదు. ఏం చేస్తారు? సుప్రీకోర్టుకు వెళతారా? మీ గోడు వినేవాడే ఉండడు. అది వారికి తెలుసు.

ఏపీలో పోలీసు అధికారులుగా సొంత మనుషుల్ని పెట్టేసుకున్నారు. డబ్బుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత తెలిసిందే కదా. నరేంద్ర మోడీ భయపడుతున్నది కూడా ఇందుకే. వీళ్లు ఏమైనా చేస్తారన్నదే ఆయన భయం. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా ఇవ్వాల్సిన లక్షల కోట్లు ఇస్తే… మోడీ-షా లకు చంద్రబాబు చెక్ చెప్పేస్తారని తెలుసు. అందుకే మోడీ షాలు జాగ్రత్తపడ్డారు. భాజపా మోసం చేసింది అని ఆంధ్రలో గగ్గోలు పెట్టేవారు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి?

మన తండ్రి నెలకు రూ.10 వేలు ఇస్తాడు. మనం లెక్క చెప్పం. తండ్రి ఏం చేస్తాడు? వచ్చే నెల నుంచీ ఇవ్వడం మానేస్తాడు. మా నాన్న దుర్మార్గుడు డబ్బులు ఇవ్వడం లేదు.. అని అంటే జనం నమ్ముతారా? లేక జనం నమ్మినారని అనుకుందాం. మీకు మరో రూ.10 వేలు ఇచ్చి… తండ్రిగా తాను మంచి వాడినేనని నిరూపించుకోవాలా? ఇదీ ఇపుడు ప్రధాని నరేంద్రమోడీ ఉన్న స్థితి.

మీడియా, నేతలూ ఇద్దరూ ఒకే విషయం చెబుతుంటారు. మోడీ దొంగ అని చంద్రబాబు అంటాడు. ఆయనకు అనుకూలంగా ఉన్న మొత్తం మీడియా కూడా ‘‘అంతేగా అంతేగా’’ అంటూ రకరకాల కారణాలను సహేతుంగా ఒక చోట పేర్చి అవును ‘‘ఇదిగో మోడీ దొంగే’’ అని రాస్తున్నది. నాగపూరులో ఆర్ ఎస్ ఎస్ అనుకుందో లేదోగానీ… యల్లో మీడియా వార్తలు అనధికారిక సమాచారం అనీ, మోడీని మార్చేసి అక్కడ గడ్కరీని ప్రతిష్ఠిస్తారని వార్తలు బయటకు వదిలేశాయి. గడ్కరీ ప్రధాని అయితే… తిరుమల గుళ్లోకి వెళ్లినట్లుగా సరాసరి వెళ్లిపోవచ్చు. సర్ సర్ అనాల్సిన పని కూడా లేదు.

ఒక విషయాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారు. ఒక బ్రాహ్మణడు.. భుజాన మేకను పెట్టుకుని వెళుతున్నాడు. దారిలో అది చూసిన పది మంది దొంగలు విడివిగా కలిసి ‘‘అదేమిటండీ.. కుక్కును భుజాన పెట్టుకున్నారు?’’ అని అడిగారు. పది మంది అబద్ధం ఎలా చెబుతారని అనుకున్న బ్రాహ్మణుడు మేకను వదిలివెళ్లిపోతాడు. దొంగలు ఆ మేకను కోసుకుని తినేస్తారు. తెలుగు రాజకీయాలు ఇంతకంటే భిన్నంగా ఏమీ లేవు. బ్రాహ్మణుడిని తెలుగు ప్రజలు అనుకుంటే, ప్రజాస్వామ్యం అనేది మేక. తెలుగు వారిని ఇక ఆ దేవదేవుడైన ఆ వేంకటేశ్వరుడే కాపాడాలి. ఇపుడు ఆయన మీ కోరికలు వింటున్నాడో లేక వెంకన్న చౌదరి అని ఆ ప్రేమాజిక వర్గం అన్న తర్వాత ఆయన కూడా ముఖం చాటేశాడేమో తెలియదు. చెక్ చేసుకోండి ఒక్కసారి!!

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *