ఎస్పీ, బీఎస్పీ డుమ్మా… 21 పార్టీలతో భేటీ

December 10, 2018 | News Of 9

  • సమన్వయం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు
  • కాంగ్రెసు తరఫున హాజరైన రాహుల్, సోనియా, మన్మోహన్ సింగ్
  • వామపక్ష నేతలు కూడా హాజరు
  • ఎన్డీఏ నుంచి వైదొలగిన కుష్వాహా
  • మంత్రి పదవికి రాజీనామా

న్యూఢిల్లీ: భాజపాయేతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ పార్లమెంటు అనెక్సు భవనంలో సమావేశమై… భవిష్యత్తు కార్యాచరణను చర్చిస్తున్నాయి.  సమావేశానికి బీఎస్పీ, ఎస్పీ తప్ప, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మాత్రమే అత్యధిక సంఖ్యలో ఎంపీలను పార్లమెంటుకు పంపుతున్నది. అందువల్ల ఎస్పీ, బీఎస్పీ లేకుండా వచ్చే ఏ కూటమి అయినా బలహీనంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఈ సమావేశానికి తొలిసారిగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకావడం విశేషం. నిజానికి కేజ్రీవాల్ కు ఇటు కాంగ్రెసుతోనూ, అటు భాజపాతోనూ విభేదాలున్నాయి. సమావేశానికి శరద్ పవార్ (ఎన్సీపీ), రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ (కాంగ్రెసు), సీతారాం ఏచూరి (సీపీఎం), చంద్రబాబు (తెలుగుదేశం), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మమతా (తృణమూల్), కేజ్రీవాల్ (ఆప్), తేజస్వీ యాదవ్ (ఆర్జేడీ), దేవెగౌడ (జేడీఎస్), శరద్ యాదవ్ (ఎల్జేడీపీ), రాజా, సుధాకర్ రెడ్డి (సీపీఐ), హేమంత్ సొరేన్ (జేఎంఎం), బాబూలాల్ మరాండీ (జేవీఎం), జితిన్ రామ్ మజ్హి (హెచ్ఏఎం)లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 21 పార్టీల ప్రతినిధులు వచ్చారు. సేవ్ ద నేషన్ సేవ్ డెమోక్రసీ అనే పేరుతో ఉన్న పుస్తకాన్ని విపక్ష పార్టీలకు ఏపీ సీఎం చంద్రబాబు అందజేశారు.

మోదీ మంత్రివర్గాన్ని వీడిన కుష్వాహా

ఎన్డీయేలోని కీలక భాగస్వామ్య పక్షమైన రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్ఎస్‌పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా సోమవారం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్డీయే నుంచి కూడా తప్పుకున్నట్టు ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆయన రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీట్ల పంపకాల విషయంలో వచ్చిన విభేదాలే ఆ నిర్ణయానికి కారణం. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం ఉపేంద్ర ఈ ప్రకటన చేశారు. ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో భాజపాతో తలపడటానికి ఆయన ప్రతిపక్షాల కూటమితో చేయి కలపనున్నట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ బీహార్‌లో కీలకమైన రాజకీయపక్షంగా ఉంది.

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ తో భాజపా సీట్ల పంపకం పై ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి ఉపేంద్ర తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సమతా పార్టీకి కేవలం రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించడంతో ఎన్డీఏతో బంధం బీటలు వారింది. బీహార్‌కు 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఆయన ప్రతిపక్షాల కూటమైన ఆర్జేడీకాంగ్రెస్‌ తో చేతులు కలపనున్నట్లు తెలుస్తుంది. అలాగే నితీశ్‌తో విభేదాల కారణంగా జనతాదళ్ నుంచి వెళ్లిపోయిన శరద్‌ యాదవ్‌ తన పార్టీని సమతా పార్టీలో కలపనున్నట్లు భావిస్తున్నారు.

గతవారం పార్టీ సమావేశం అనంతరం ఆర్‌ఎల్ఎస్‌పీ ఓ ప్రకటన విడుదల చేసింది. మేము మసీదులుఆలయాలు నిర్మించడానికి వ్యతిరేకం కాదు. పేదరికంనిరక్షరాస్యతనిరుద్యోగిత వంటి తీవ్రమైన అంశాలను మర్చిపోయేలా కేంద్రంలో అతిపెద్ద పార్టీ (భాజపా) నాయకులు ప్రయత్నిస్తున్నారు’ అంటూ విమర్శించింది. నితీశ్ ప్రభుత్వం మీద అంతే స్థాయిలో విరుచుకుపడింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *