అధిక ఫీజులు వద్దన్న సుప్రీం.. వాసవి, శ్రీనిధి విద్యార్థులకు ఊరట

December 5, 2018 | News Of 9

 

Supreme Court whips on engineering colleges | news of 9

న్యూఢిల్లీ: వాసవి, శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ కళాశాలల ఫీజు నియంత్రణ కమిటీ నిబంధనల ప్రకారమే ప్రస్తుతానికి విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో శ్రీనిధి కళాశాల విద్యార్థులకు అధిక ఫీజుల నుంచి ఉపశమనం లభించినట్లయింది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ పేరెంట్స్ అసోసియేషన్ పిటిషన్ తో పాటే దీన్ని విచారిస్తామని చెప్పింది. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కళాశాలలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 3వ వారానికి వాయిదా వేసింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *