బన్నీ ఫ్యామిలీ చిలిపి గొడ‌వ ఎంత వ‌ర‌కు వ‌చ్చిందంటే..

February 9, 2019 | News Of 9

Sweet war in the social media: Bunny and his wife | telugu.newsof9.com

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ క‌మింగ్ ప్రాజెక్టు సిద్ధ‌మ‌వుతున్నాడు. సినిమా ప్రారంభమయ్యే లోపు విలువైన సమయాన్ని తన ఫ్యామిలీ కోసం బన్నీ వెచ్చిస్తున్నాడు. అల్లు అర్జున్ తన ముద్దుల కుమార్తె అర్హతో సరదాగా జరిగిన సంభాషణ సోషల్ మీడియాని ఊపేస్తోంది. దీని అనంతరం అల్లు అర్జున్, స్నేహ దంపతుల మధ్య చిలిపి గొడవ ఒకటి జరిగింది.

అల్లు అర్జున్ తన ముద్దుల కూతురు అర్హతో నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటావు కదూ అని అడిగాడు. దీనిని అర్హ చాలా ఫన్నీ రిప్లై ఇచ్చింది. నేను చేసుకోను అని చెప్పేసింది. బన్నీ ఎంత బతిమిలాడినా నేను చేసుకోను అనే మాట మార్చలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తోంది. బన్నీ ఈ వీడియోని ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 24 గంటల్లోపే ఒక‌ మిలియన్ వ్యూస్ దాటేసింది. ఫాన్స్ లైక్స్, షేర్స్ తో ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

బన్నీ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన త‌ర్వాత సతీమణి అల్లు స్నేహ స్పందించింది. అల్లు అర్జున్ ని సరదాగా ఓ ప్రశ్న అడిగింది. నువ్వు చేసుకున్నావా మీ నాన్న చెప్పిన అమ్మాయిని అని అడగగా బన్నీ కూడా అంతే సరదాగా సమాధానం ఇచ్చాడు. అబ్బా చా.. నువ్వు చేసుకున్నావా అని అడిగాడు. వీళ్లిద్దరి చిలిపి గొడవ నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంది. వీళ్లిద్దరి సంభాషణ రానా, మంచు లక్ష్మి, అల్లు శిరీష్ లాంటి సెలెబ్రిటీలని కూడా ఆకట్టుకుంది. బన్నీ, స్నేహ చాట్ కు లైక్స్, స్మైలీ ఎమోజిలతో ఫ్యాన్స్ మోతెక్కిస్తున్నారు. మొత్తానికి బ‌న్నీ ఫ్యామిలీ మ్యాట‌ర్ అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేస్తోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *