స్వైన్ ఫ్లూ భయంతో గ్రామస్థుల వెలి

December 9, 2018 | News Of 9

Swine flu sets a village in outcast | Newsof9

అవనిగడ్డ (కృష్ణాజిల్లా):  గ్రామంలో ఒక వ్యక్తి స్వైన్ ఫ్లూతో చనిపోయాడని… ఆ గ్రామం మొత్తాన్నీ వెలివేసిన దుర్మార్గమిది. కృష్ణాజిల్లా అవనిగడ్డలో జరిగింది. కోడూరు మండలం చింతకోళ్ల గ్రామానికి చెందిన నాంచారయ్య (45) మూడు రోజుల క్రితం స్వైన్ ఫ్లూతో చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన పేరే మరియమ్మ(32) కూడా అయిదు రోజుల కిందట అంతుచిక్కని వ్యాధితో మృతి చెందింది. స్వైన్ ఫ్లూ వైరస్ చింతకోళ్ల గ్రామం మొత్తం వచ్చిందంటూ పుకార్లు రావడంతో గ్రామస్థులు భయంతో వణికిపోతున్నారు. సమీప గ్రామాల ప్రజలు చింతకోళ్ల వాసులతో మాట్లాడటం మానుకున్నారు. ప్రవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థులకు అనధికారికంగా సెలవులు ప్రకటించాయి. ఆ గ్రామానికి స్కూల్ బస్సులు రావని,  కొన్నిరోజుల వరకు పాఠశాలకు రావద్దని ఒక  స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. గ్రామానికి పాలు పోయాడానికి వచ్చే వారు కూడా పాల సరఫరా నిలిపి వేశారు. హోటల్ లో టిఫిన్ కోసం వెళ్లడానికి కూడా గ్రామస్థులకు అవకాశం లేకుండా పోయింది. మంచినీటి కోసం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందపాకల గ్రామానికి వెళ్లినపుడు వాళ్లు కూడా మా గ్రామానికి రావద్దని వారిస్తున్నారు. ఇరాలి గ్రామంలో అయితే…. చింతకోళ్లకు వెళ్లవద్దంటూ మైకుల ద్వారా ప్రచారం నిర్వహించినట్లు సమాచారం. ఆర్టీసీ బస్సుల నుండి చింతకోళ్ల గ్రామ ప్రజలు దిగిపోవాలంటూ తోటి ప్రయాణికులు గొడవ చేస్తున్నారు.
చింతకోళ్ల గ్రామ ప్రజలు ఇలా అడుగడుగునా అవమానాలకు గురవుతున్నా… ప్రభుత్వం మాత్రం దిక్కులు చూస్తోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *