దేశ, విదేశాల్లో సైరా సందడి..

September 29, 2019 | News Of 9
previous arrow
next arrow
Slider

అక్టోబర్ 2 కోసం అభిమానుల ఎదురుచూపులు
రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమంటున్న ఫ్యాన్స్

సైరా ఫీవర్ మాములుగా లేదు. చిన్నా పెద్దా అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా విడుదలకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో ప్రవాస చిరంజీవి అభిమానుల సందడే ఇందుకు నిదర్శనం. బే ఏరియా చిరు ఫ్యాన్స్ అందులోనూ లేడీ ఫాన్స్ హంగామా చూస్తే ఔరా అనిపించక మానదు. 8 అడుగుల ఎత్తు 40 అడుగుల భారీ పోస్టర్ ను ఆవిష్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సైరా టీం కు అభినందనలు తెలిపుతూ.. సినిమా విడుదల కోసం తామెంతగా ఎదురుచూస్తున్నదీ చెప్పకనే చెబుతున్నారు.

రెండో ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు పెరిగిపోయాయి. అందులో చూపించిన ఒళ్ళు గగుర్పొడిచే పోరాట సన్నివేశాలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. నిజమే 60 యేళ్ల పైబడిన వయసులో డూప్ లేకుండా చిరంజీవి చేసిన ఎనర్జిటిక్ మూవ్స్ చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. సైరాను బాహుబలితో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. బాహుబలి ఎంత గొప్ప సినిమా అయినా అది కల్పిత కథ. కానీ సైరా అలాకాదు. తెలుగు వారి పోరాట స్ఫూర్తిని తెలియజేసే వీరుని గాథ. ఓ నిజ జీవిత కథ. అందుకే సన్నివేశాలు, కథనం ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే రికార్డుల బూజుదులపడం కష్టమేమీ కాదంటున్నారు.

సైరా నరసింహారెడ్డి సినిమా చిరంజీవికి ఓ స్వప్నం. బడ్జెట్ విషయంలో రాజీపడలేకే అప్పట్లో దానిని పక్కన పెట్టారు. కానీ బడ్జెట్ లో రాజీ పడకుండా పెద్ద సినిమా మార్కెట్ ఎలా చెయ్యాలో బాహుబలితో రాజమౌళి రాజమార్గం వేసి చూపాడు. అలా మొదలై ఓ చారిత్రక చిత్రంగా రూపొంది విడుదలకు సిద్దంగా ఉంది. సైరా నరసింహారెడ్డి సినిమా ఐదు భాషల్లో.. అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమ అభిమాన హీరో చిరంజీవిని ఇలాంటి చారిత్రక పాత్రలో చూడాలన్న అభిమానుల కోరిక, మెగాస్టార్ కల రెండూ నెరవేరేది అక్టోబర్ 2నే..

Other Articles

6 Comments

  1. Great blog! Is your theme custom made or did you download it from somewhere? A theme like yours with a few simple adjustements would really make my blog shine. Please let me know where you got your design. Bless you

  2. I do enjoy the way you have framed this problem and it does indeed provide me personally a lot of fodder for consideration. However, through what I have observed, I simply hope when the opinions pack on that men and women continue to be on point and don’t embark on a tirade regarding some other news of the day. Anyway, thank you for this excellent point and whilst I do not necessarily concur with this in totality, I value your perspective.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *