సైరా చిరంజీవి.. మెగాటైం మొదలైంది

September 23, 2019 | News Of 9

సాధారణంగా ఏ హీరోకైనా ఒకే వారసుడు వస్తాడు. తన కంటే మెరుగైన డాన్సులు, ఫైట్లలో శిక్షణ పొంది మరీ వస్తాడు. వారిలో కొందరు తండ్రిని మించి కూడా ఎదుగుతారు. కానీ ఒక్క చిరంజీవికి మాత్రం ఒక్క వారసుడు సరిపోడు, ఆయనలోని ఒక్కొక్క క్వాలిటీకి ఒక్కో స్టార్ రావాల్సిందే. అయినా ఇంకా ఎక్కడో కాస్త లోటు మిగిలే ఉంటుంది. ఇంకా ఆయన వారసులు వస్తూనే ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులే కాదు. స్వయం కృషితో ఎదిగే ప్రతి వ్యక్తీ చిరంజివి వారసుడే.. కష్టపడి గొప్ప స్థానానికి చేరుకోవడానికి చిరంజీవి రోల్ మోడల్. అరవై యేళ్లు కాదు, ఇంకెన్నేళ్లయినా ఆయన అలాగే ఉంటాడు. ఇప్పటికీ అంతే కష్టపడి పనిచేయడం ఆయన అలుపెరుగని పోరాటానికి నిదర్శనం. ఎంత అణిచివేసినా ఆయనలో మార్పురాదు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా జీవించడం ఆయన ఫిలాసఫీ. తననూ తన ఫ్యామిలీని ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా ఎవరినీ పల్లెత్తుమాట అనడు. ప్రయాణం, గమ్యంపై అవగాహన ఉన్న వాళ్లు అలానే ఉంటారు. అందుకే ఆయన 151తో ఆగడు.. వందేళ్ల తెలుగు సినిమా పండుగలోనూ ఆయనే లిజెండ్ గా నిలబడతారు. అతిరథ మహారథుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుని అక్టోబరు 2న విడుదలకు సిద్ధమవుతోన్న సైరా చిత్రం అఖండ విజయం సాధించాలని కోరుకుందాం..

 

Other Articles

7 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *