మాజీ మంత్రి రావెలపై దేశం నేతల స్పందన బాగాలేదు: పవన్

December 4, 2018 | News Of 9

 

Pawan Kalyan | telugu.newsof9.com

హైదరాబాదు: రావెల కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో చేరడంపై స్థానిక పత్తిపాడు తెలుగుదేశం నాయకులు కించపరుస్తూ మాట్లాడటాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలోని సుహృద్భావ వాతావరణాన్ని భగ్నం చేస్తాయని తెలుగుదేశం నాయకులు తమ పార్టీ నేతను కించపరుస్తూ మాట్లాడటం ఏమీ బాగాలేదని ఆయన అన్నారు. రావెల వెళ్లిపోవడంతో పార్టీకి పట్టిన మైల తొలగిపోయిందంటూ గుంటూజిల్లా తెలుగుదేశం నేతలు చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్నంలోని దళిత సంఘాలు భగ్గుమన్నాయి. కులపరంగా వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ… వారంతా విశాఖపట్నంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

రావెల జనసేనలో చేరిన తర్వాత స్థానికంగా ఏం జరిగింది?

మాజీ మంత్రి రావెల తెలుగుదేశం పార్టీని వదిలిపోయినందున, టీడీపీకి పట్టిన మైల వదిలిపోయిందని పత్తిపాడు నియోజకవగర్గ తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డవారిపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పసుపు నీళ్లతో శుద్ధి కూడా చేశారు. దీనిపైనే… విశాఖపట్నానికి చెందిన జనసేన నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ.. మొదటి నుంచీ దళితులంటే చిన్నచూపే చూస్తోందని మాజీ మంత్రి రావెల కూడా ఇటీవల వ్యాఖ్యానించారు. కేవలం పదవులు మాత్రమే ఇస్తారని, అధికారాలు మాత్రం వారి దగ్గరే ఉంచుకుంటున్నారని రావెల మండిపడ్డారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *