బాబుపై జాలి పడితే.. బంగాళాఖాతమే!

December 30, 2018 | News Of 9

తొలి అంకం మొదలైంది…!!

‘‘బాంబులు… 120 సీట్లు’’ కథనంలో ‘‘న్యూస్ ఆప్ 9’’ చెప్పినట్లు తొలి అంకం మొదలైంది. డిజైన్ 1, డిజైన్ 2 రెండూ ఇపుడు యాక్షన్ లో ఉన్నాయి. (ఈ రెండు స్టోరీల తర్వాత ‘‘బాబుపై జాలి పడితే.. బంగాళాఖాతమే!’’ అన్న ఈ నాటి స్టోరీ రాయాల్సి వస్తుందని ఊహించినదే).

కేసీఆర్: చంద్రబాబు లాంటి డర్టీయెస్ట్ పొలిటిషియన్ ఈ దేశంలో లేరు.

అవును. ఇది నిజమే. అంగీకరించాల్సిందే.

కేసీఆర్: చంద్రబాబు నాయుడుకు మెదడున్నట్టా. ఏది పడితే అది మాట్లాడితే నడుస్తదని బాబు అనుకుంటున్నాడు. ఆయన మాట్లాడిన దానికి తలాతోకఅర్థంపర్థం ఉండదు.

చంద్రబాబుకు మెదడు లేదని కేసీఆర్ నిజంగానే అనుకుంటున్నారా? చంద్రబాబుకు పెద్ద మెదడే ఉంది. తలా తోకా ఎందుకు ఉండదు. ఉన్నాయి. కోస్తాంధ్రలో తన సామాజిక వర్గం వారి ఆకాంక్షలకు నిలువెత్తు విగ్రహం చంద్రబాబు. మరి అర్థం లేకపోవచ్చు. కానీ ‘పరమార్థం’ కచ్ఛితంగా ఉంది. ఈ విషయం సీఎం రమేష్, సుజనా చౌదరి, లేదా నవయుగ కంపెనీ యజమానినీ, లేదా కోస్తాలో ఉన్న పెట్టుబడిదారులను ఎవరిని అడిగినా పరమార్థం ఉన్న మాట వాస్తవమేనని చెబుతారు. చంద్రబాబు కృష్ణానదిని ఇప్పటికే ఎవరికైనా అమ్మేసి ఉండొచ్చని మా అనుమానం.

కేసీఆర్: ఇప్పుడు రాహుల్ సంక నాకుతున్నాడు… నాలుగేళ్లు మోదీ సంక నాకినవు. మోదీ ఒడిలో కూర్చున్నావు. అప్పుడు నువ్వు చెబితే మోదీకి డబ్బ కొట్టాలి మేం. నీకు ఉల్టా అయితే పోయి రాహుల్ గాంధీ సంక నాకుతవు. నువ్వు కాంగ్రెస్ సంక నాకగానే మేమంతా కాంగ్రెస్ వెంట రావాలా 

అవును. ఇది నిజమే. అంగీకరించాల్సిందే.

కేసీఆర్: ఏం మొహం పెట్టుకొని వస్తున్నాడు మోదీ అంటున్నాడు. నీకు ఒక పాలసీపద్ధతి ఉందా?

అవును. ఇది నిజమే. అంగీకరించాల్సిందే.

కేసీఆర్: నీ రాజకీయ స్వార్థం కోసం ఏదైనా చేస్తవు. నీకు నీతీ లేదు జాతీ లేదు. నువ్వు దద్దమ్మవు. నీకు తెలివి లేదు.

ఇది తప్పు.

ఎందుకంటే.. చంద్రబాబు ప్రతిసారీ తెలుగు ప్రజల కోసమే పని చేస్తున్నాని అన్నది తన సామాజిక వర్గం వారిని ఉద్దేశించి చెప్పింది. కాపులూ, బీసీలూ, ఎస్సీలూ, ఎస్టీలూ ఆయన ఎప్పుడూ తెలుగు ప్రజలను మాట్లాడలేదు. దద్దమ్మ అసలే కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన సామాజిక వర్గంపెట్టుబడిదారుల కోసం పని చేస్తున్నాడు. వారి దృష్టిలో చంద్రబాబు ఒక  సామాజిక ఉద్దారకుడు. వారి ఆత్మగౌరవానికి ఒక నిలువెత్తు ప్రతీక, రాజ ప్రతినిధి. కేసీఆర్ తో సహా కోదాడకు ఇవతల ఉన్న వారూ, అవతల ఉన్నవారూ ఛీ అన్నా ఏమాత్రం ఇబ్బందిలేకుండా తుడిచేసుకుంటున్న సహనశీలి. సొంత సామాజిక వర్గం కోసం ఇన్ని చివాట్లను, అవమానాలను అదీ ఈ వయసులో భరించే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా దేశంలో..?

కేసీఆర్  కు ఇపుడు తిట్టాల్సిన పనేలేదు. ప్రజాభిమానం మెండుగా ఉంది. ఇపుడు ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది అంతే. కానీ తిట్టారు. రైట్ ఆన్ ది వాల్ట్రై టు అండర్ స్టాండ్ బిట్వీన్ ద లైన్స్!!

కాస్త లోతుగా.. ఇంకాస్త లోతుగా ఆలోచించండి!!  

సరే, ఇక అసలు విషయానికి వద్దాం.

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంటు కోసం పర్యటించి వచ్చి.. ఆ విషయాలు చెబుతానని అన్నారు. కానీ అకస్మాత్తుగా విలేకరుల సమావేశం మొత్తం.. చంద్రబాబును కేంద్ర బిందువుగా మార్చేశారు. కారణం ఏమై ఉంటుంది? తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు వచ్చాడు. తెలంగాణ సెంటిమెంటును బాగానే రగిలించాడు. తెలంగాణ మొత్తం ఏక బిగిన ఓట్లు తెరాసకు గంపగుత్తగా కొట్టేసి ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో కేసీఆర్ ను తీసుకెళ్లి ఆయన ఎవరికీ అందనంత ఎత్తున కొండ మీద కూర్చోబెట్టారు. మరిక ఇప్పట్లో కేసీఆర్ కు ఢోకాలేదు. కేసీఆర్ రిటర్న్ గిఫ్టు పాలసీలో ఇది తొలి అంకం మాత్రమే. అయతే.. తిట్టమని చెబితే కేసీఆర్ మామూలుగా కాకుండా శివాలెత్తిపోయేట్లు తిట్టిపోశారు. దేశంలోనే ఇంత డర్టీ పాలిటీషన్ ఎవరూ ఉండరని కూడా చెప్పేశారు. రేపు ఆంధ్ర ఎన్నికలు జరిగేవేళ తిట్టడానికి కొన్ని తిట్లు, శాపనార్ధాలను దాచుకోవచ్చు కదా అని అనిపించింది.  ఏపీలో ఆంధ్ర సెంటిమెంటును రగిలించేందుకు కేసీఆర్ ‘‘రిటర్న్ గిఫ్టు’’ ఇస్తారని తెలుసుకానీ… తొలి అంకంలోనే ఘాటు ఏకంగా నషాళానికి అంటుకునేలా తిడతారని టీడీపీ నేతలే ఊహించలేదు. ‘‘కానీ మరీ ఓవర్ గా తిట్టినట్లున్నాడు. దీనివల్ల అసలుకే మోసం వస్తుందేమో’’ అని వ్యాఖ్యానించారు. అంటే డిజైను బెడిసికొట్టి పూర్తిగా చంద్రబాబు ఎన్నికల్లో కొట్టుకుపోతాడేమో అన్న అనుమానం వచ్చింది. చంద్రబాబును తెలంగాణాధీసుని చేత చెత్త చెత్తగా తిట్టించుకుని, శాపనార్ధాలు పెట్టించుకుని… వాటినే ఆశీర్వచనాలుగా మలచుకుని ఆంధ్రా సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా ఆంధ్రా అధికార కిరీటాన్ని మరొకరికి దక్కకుండా చేయాలన్నది అసలు ఈ మాయా జూదంలో ముఖ్యమైన అంకం. సత్యహరిశ్చంద్రలో కాటిసీనుకు ఉన్నంత ప్రాధాన్యత దీనికి ఉంది. ఇదే కీలకం. డోసు ఎక్కువైతే చికిత్స వికటించనూ వచ్చు. అది వేరే సంగతి.

కేసీఆర్ తన పాత్రను అవసరానికి మించి చక్కగానే రక్తి కట్టించారు. వాగ్దాటిలో కేసీఆర్ ఘనాపాటి. తిట్టమంటే ఆపకుండా… ఎక్కడా బ్రేకులు కూడా లేకుండా ఏకిపారేశారు. మరి దీనికి తెలుగుదేశం పార్టీ స్పందన ఏమిటి? ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందన ఏమిటి? మరీ ముఖ్యంగా చంద్రబాబుకు వంతపాడే యల్లో మీడియా స్పందన ఏమిటి? ఇపుడు సీను… తెలంగాణ నుంచి ఆంధ్రాకు మారుతుంది. కోదాడ అవతలి నుంచి స్పందన ఏమిటి అన్నదే ఇపుడు చూడాలి. ఇప్పటి వరకూ ‘‘న్యూస్ ఆప్ 9’’ చెప్పినట్లే జరుగుతోంది. కోదాడ అవతల వర్గాల స్పందన కూడా సరిగ్గా అదే దిశలో సాగుతున్నట్లు ప్రాథమిక స్పందనలు చెబుతున్నాయి.

ముందుగా యల్లో మీడియా సంగతి చూద్దాం. ఈనాడు దినపత్రిక పెట్టి దాదాపు 44 ఏళ్లు అవుతోంది. అది పుట్టినప్పటి నుంచీ తెలుగుదేశం మీదగానీ, చంద్రబాబు మీదగానీ… ఇంత బాహాటంగా అర పేజీలో పరిచేయడం ఎప్పుడూ లేదు. చంద్రబాబుపై వ్యతిరేకంగా వచ్చే వార్తల్ని అసలు ప్రచురించరు. తప్పదు అనుకుంటే ఏదో ఒక మూల పిసరంత మేమూ వేశాముగా అన్నట్లు పడేస్తారు. కేసీఆర్ తిట్ల డండకాన్ని మొదటి పేజీలో అర పేజీ మొత్తం పరిచేశారు. ఆంధ్రలో ఇంకా పెద్దదే వేసి ఉండొచ్చు. 44 ఏళ్లలో చెయ్యనిది ఇపుడు ఎందుకు చేశారు? సుస్పష్టం. చంద్రబాబును మరోసారి అధికారంలో కొనసాగించాలంటే తక్షణం… కోస్తాంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధి అయిన చంద్రబాబుకు చేతికి బలమైన ఆయుధం కావాలి. రాజకీయాల్లో సెంటిమెంటును మించిన ఆయుధం మరొకటి లేదు. ఇది మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో అక్షరాలా మంచి ఫలితాలనే అందించింది. నిజానికి తెరాసకు 35 సీట్ల కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. కానీ సెంటిమెంటు 88 సీట్లను తెచ్చిపెట్టింది. ఇదే ప్రయోగాన్ని ఆంధ్రాలో రిపీట్ చేస్తే… బాబుగారికి 120 వస్తాయని తెలుగుదేశం అంచనా వేస్తోంది. కేసినేని నాని ఈ అంచనాలను బయట పెట్టారు కూడా.

రాక్షసుడి ప్రాణం చిలుకలో ఉంటుందన్న సామెత తెలిసిందే కదా. చంద్రబాబు విజయం అన్నది యల్లో మీడియాలో ఉంది. యల్లో మీడియా ఉన్నంత కాలం ఈ గారడీ విద్యలన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఈనాడు పత్రిక 44 ఏళ్లలో ఎప్పుడూ చేయని సాహసం చేసింది. చంద్రబాబును దేశంలోనే ఇలాంటి డర్టీ రాజకీయవేత్త లేడని తిడితే దానిని అర పేజీలో ప్రచురించింది. ‘‘అరె. చంద్రబాబును విమర్శిస్తే అర పేజీలో ఈనాడు వేసిందా? బాగు బాగు’’ అని చంకలు కొట్టుకునే వారు ఉంటారు. కానీ మీడియా అన్నది రెండు వైపులా పదునున్న కత్తి. స్వామికార్యం, స్వకార్వం అన్నీ ఒకే దెబ్బకు తీరతాయి. కానీ ఈనాడు గానీ, దాని వెనుక ఉన్న తెలుగుదేశం కానీ ఆశించే ఫలితం వేరు. ఆంధ్రా సెంటిమెంటును రెచ్చగొట్టాలి. ప్రజల్ని రోడ్డు మీదకు లాక్కుని రావాలి. కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేయాలి. ధర్నాలు చేయాలి. 1983 నుంచి అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచీ తెలుగు దేశం పార్టీకీ, కోస్తాంధ్ర ధనికులకు కామధేనువులా లాభాలను తెచ్చిపెట్టిన నినాదం –తెలుగు ఆత్మగౌరవం. ఇదే విషయాన్ని మరోసారి తెరపైకి తెస్తారు.

ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి స్పందన ఏమిటి? కేసీఆర్ ప్రసంగం అయిన వెంటనే, తెలుగు తమ్ముళ్ల స్పందనలు సేకరించింది. టీవీల్లో ఈ దృశ్యాలను ప్రసారం చేశారు. అక్కడక్కడా దిష్టి బొమ్మలను తగలబెట్టించారు. అదీ చూపించారు. ఒక టీడీపీ నేత… గొట్టిపాటి రామకృష్ణ ఏమంటున్నారో చూడండి. ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ వాడిన నీచమైన భాషను చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారు. ఇటువంటి నేతనా మేము ఎన్నుకున్నది అని తెలంగాణ ప్రజలు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా విమర్శలు సహజమే అయినా… కేసీఆర్ నీచంగా మాట్లాడటాన్ని ప్రజలు తప్పు పడుతున్నారు. చంద్రబాబు పని తీరును జాతీయ స్థాయి నాయకులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. కేసీఆర్ కు చంద్రబాబు ను విమర్శించే కనీస అర్హత లేదుఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. తెలంగాణా ఎన్నికలలో అవకతవకలు జరిగాయి. 29 లక్షల ఓట్లు గల్లంతు కావడంతో గెలుపోటముల పై ప్రభావం చూపాయి’’ అని చెప్పుకొచ్చారు గొట్టిపాటి వారు.

అంటే కేసీఆర్ అడ్డంగా గెలిచారు అని ఆయన చెబుతున్నాడు. మళ్లీ అటూ ఇటూ రెండో శ్రేణి నేతల మధ్య ప్రకటనల యుద్ధం జరగాలి. తర్వాత తాయితీగా… చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి… కన్నీరు పెట్టుకుంటారు. ఏపీ ప్రజల జాలి కోసం జోలె పడతారు. ఇంత చేస్తున్నా తిడుతున్నారని అంటారు. యల్లో మీడియా, నేతల ప్రకటనలూ వెరసి.. సెంటిమెంటు రగులుతుంది.

ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. టీడీపీ ఓట్లు టీడీపీకి ఉంటాయి. వైఎస్సార్సీపీ ఓట్లు దానివి దానికే ఉంటాయి. పవన్ వెళ్లిపోవడం ద్వారా చీలే ఓట్లనూ, వ్యతిరేక ఓట్లనూ సెంటిమెంటుగా మార్చుకుంటే జగన్, పవన్ ఇద్దరూ పోతారన్నది ఎత్తుగడ. ప్రతి ఎన్నికల్లో తటస్థులు ఉంటారు. వీళ్లు గోడ మీద కూర్చుని ఎటూ తేల్చుకోలేరు. ఈ తటస్థుల ఓట్లను మార్చుకోవడం కీలకం. సెంటిమెంటు రగిలినపుడు వీరంతా తప్పకుండా పోలింగ్ లో పాల్గొంటారు. కేసీఆర్ తిట్టడాన్ని చూసి చాలా మంది చంద్రబాబు వ్యతిరేకుల ఛాతీ సైజు నిన్న 40 అంగుళాలు పెరిగిపోయి ఉంటుంది. ఆనందంతో బీర్లు కూడా తాగేసి ఉంటారు. ఏం తిట్టారు నాయనా అంటూ పండగ చేసేసుకున్నారు. నిజానికి కేసీఆర్ కొత్తగా చెప్పిందేమీ లేదు. ప్రజల్లో ఇప్పటికే ఈ అభిప్రాయాలన్నీ ఉన్నాయి. ప్రధాన మీడియా మాత్రం ప్రచురించ లేదు. కేసీఆర్ బాహాటంగా అన్నారు కాబట్టి ప్రధాన మీడియా ప్రచురించింది. తెలుగుదేశానికి కావాల్సింది ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న వారి ఓట్లు కానే కాదు. తటస్థుల ఓట్లు. సెంటిమెంటును రగిలించినపుడు తటస్థులు జాలి పడతారు. రేపోమాపో ఎన్టీఆర్ సినిమా కూడా రాబోతున్నది. సెంటిమెంటు ఒక్కటే తెలుగుదేశం చేతిలో ఉన్న బలమైన ఆయుధం. ఓడిపోతే ఏటా రూ.2 లక్షల కోట్లు కోస్తాంద్ర పెట్టుబడిదారుల చేయి జారిపోతాయి.  

‘‘తిరుపతి నుంచి ఇపుడే అందిన వార్త: చర్చనీయాంశంగా మారుతున్న కేసీఆర్ వ్యాఖ్యలు.. కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్న తిరుపతి టీడీపీ నేతలు.. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక కోస్తామంటూ హెచ్చరిక.. చంద్రబాబు పెట్టిన భిక్షతో అభివృద్థి చెందిన తెలంగాణాలో కేసీఆర్ సీఎంగా ఉన్నాడు.  బాబును విమర్సించే అర్హత కేసీఆర్ కు లేదు’

టీడీపీ నేతలు

‘‘కేసీఆర్ గిఫ్టును ఆనందకరంగా మారుస్తాం. 74 శాతం ఓట్లతో 88 సీట్లు తెరాసకు వచ్చినట్లే ఇక్కడ కూడా 84 శాతం ఓట్లతో 160 సీట్లు టీడీపీ గెలుచుకుంటుంది’’

– ఆదివారంనాడు తిరుపతిలో మంత్రి ఆదినారాయణ

తిరుపతి నుంచి అందిన వార్తలను ఇక్కడ యథాతధంగా పెట్టేశాం. చెప్పింది జరుగుతోందా లేదా? సెంటిమెంటును రగిలిస్తున్నారు. ఇపుడు ఏపీ ప్రజల ముందు తక్షణం రెండు అంశాలు ఉన్నాయి. అయ్యో చంద్రబాబుకు అన్యాయం జరిగిపోయింది అంటూ రెచ్చిపోయే వారు ఉంటారు. అలా రెచ్చిపోవద్దు. జాలిపడ్డారా.. రాజకీయ మాయా జూదంలో ఏపీ ప్రజలు చిక్కిపోయినట్లే. చంద్రబాబుకు అందరూ కలిసి మళ్లీ సీఎం పదవిని కట్టబెడుతున్నట్లే. ఏపీ రాజకీయాలపై ‘‘న్యూస్ ఆఫ్ 9’’ వెబ్ సైటు శరపరంపరంగా విశ్లేషణలను అందిస్తోంది. రాజకీయ నేతల ఎత్తుగడలపై పొలిటికల్ సైకాలజీ కోణంలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నది ‘‘న్యూస్ ఆఫ్ 9’’ మాత్రమే.

తెలుగు రాష్ట్రంలోని బీదా బిక్కీ ప్రజలకు ఎవరు మేలు చేస్తారు? 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఒక రెండు సామాజిక వర్గాల ప్రతినిధులనే ఎన్నుకుందామా? లేక ప్రజలను మోసం చేసి.. ప్రజామోదం లేకుండా, ప్రజల ఆర్తితో సంబంధం లేకుండా అధికారాన్ని తన్నుకుపోయే వారికే మళ్లీ పట్టం కడదామా? ఆలోచించండి. మార్పు కొత్తదనాన్ని తెస్తుంది. నిల్వనీళ్లు కుళ్లిపోతాయి. మురికిగుంట రాజకీయాలను తలకెత్తుకోవాల్సిన అవసరం ఏముంది? ఆంధ్రప్రదేశ్ అన్ని వనరులూ ఉన్న అష్టలక్ష్మీ దేవాలయం. దుర్మార్గ రాజకీయాలను నడిపే వారికి పొలిమేరలు దాటిద్దామా? లేక కృష్ణా నదీ తీరాలను కబంధ హస్తాల్లో పెట్టేద్దామా?

జాలి పడ్డామా? చరిత్రలో బడుగు వర్గాలకు అధికారం దక్కే అవకాశాన్ని చేజార్చుకున్నట్లే. తెలుగు ప్రజల మనసులో మాటనే కేసీఆర్ చెప్పారు. సంతోషించండి. కానీ మరిచిపోండి. వీటికి అతీతంగా అభివృద్ధికి ప్రతీక ఎవరు? నిజాయితీగా ఉన్న నేత ఎవరు? వారికే పట్టంకట్టండిసెంటిమెంటుకు లొంగిపోకుండా నిర్ణయం తీసుకుందామని నేడు సంకల్పం చెప్పుకుందాం. 10 శాతం ప్రజల పరం కాకుండా… 90 శాతం ప్రజలకు రాజ్యాధికారం దక్కాలని ప్రార్థనలు చేయండి. మేలు జరుగుతుంది. సర్వేజనా సుఖినోభవంతు!!

Other Articles

One Comment

  1. I like what you guys are up too. Such smart work and reporting! Carry on the superb works guys I’ve incorporated you guys to my blogroll. I think it’ll improve the value of my web site :).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *