పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రెడీ అన్న ప్రభుత్వం

December 10, 2018 | News Of 9

High Court | telugu.newsof9.com

హైదరాబాద్: హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ  హైకోర్టు స్పందించింది. పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించడం రాజ్యాంగ విరుద్ధమంటూ దాఖలైన కేసును కోర్టు విచారిస్తున్న విషయం తెలిసిందే. మూడు నెలల్లోగా పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించాలని గత అక్టోబరులో హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేస్తూ హైకోర్టుకు నివేదించింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *