ట్విట్ట‌ర్ టాప్ 10లో తెలుగు సినిమాలు

December 5, 2018 | News Of 9

Bharat Ane Nenu trumps Aravindha Sametha & Rangasthalam on Twitter | telugu.newsof9.com

2018లో సౌతిండియా ఇండ‌స్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ ఏడాది ఎక్కువగా ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ఇండియన్ సినిమా హ్యాష్ ట్యాగులలో కొన్ని సౌత్ ఇండియన్ సినిమాలు మొదటి 10 స్థానాల్లో చోటు దక్కించున్నాయి. ఊహించనట్లుగానే ఇందులో స్టార్ హీరోల సినిమాలే ట్రెండింగ్ లో నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాలు టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. కానీ అగ్రస్థానంలో తమిళ హీరో విజయ్ నిలిచాడు.

 

ఇటీవల విడుదలైన దళపతి విజయ్ నటించిన సర్కార్ చిత్ర హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలిచింది. సర్కార్ చిత్రం తర్వాతి స్థానంలో ఇంకా విడుదల కూడా కానీ అజిత్ విశ్వాసం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది.

 

టాప్ 10లో మూడు తెలుగు సినిమాల‌కు చోటు దక్కింది. విశ్వాసం తర్వాత మూడవ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ న‌టించిన భరత్ అనే నేను చిత్రం నిలిచింది. డైరెక్ట‌ర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో అంద‌రిని మెప్పించారు.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం కూడా టాప్ 10లో చోటు దక్కించుకుంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అరవింద సమేత తర్వాతి స్థానంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ మూవీ రంగస్థలం చోటు దక్కించుకుంది. తెలుగులో బాహుబలి తరువాత బిగ్గెస్ట్ హిట్‌గా రంగస్థలం నిలిచింది.

 

బాలీవుడ్ లో మీటూ ఉద్యమం పెను దుమారంరేపింది. అత్యంత ప్రభావం చూపిన హ్యాష్ ట్యాగ్స్ లిస్టులో మీటూ ఒకటిగా నిలిచింది. డీప్ వీర్ వెడ్డింగ్, కేరళ ఫ్లడ్స్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండింగ్ లో నిలిచాయి. ఇక సూపర్ స్టార్ రజని కాలా చిత్రానికి తొలిసారి ఎమోజి సృష్టించారు. ఈ హ్యాష్ ట్యాగ్ కూడా అదరగొట్టింది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *