పది కోట్లు విలువచేసే బంగారు బిస్కెట్లు స్వాధీనం

March 12, 2019 | News Of 9

Ten crores worth gold seazed..

ఏలూరు: ఉంగుటూరు మండలం నారాయణ పురం టోల్ గేట్ వద్ద పోలీసుల తనిఖీలో ఓ కారులో భారీ మొత్తంలో బంగారం బిస్కెట్లు పట్టుబడ్డాయి. ఒక్కోటీ 100 గ్రాములున్న 30 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం నుండి ఏలూరు వైపు కొందరు వ్యక్తులు ఆడి కారులో ఈ బంగారాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. తాము వ్యాపారులమనీ, బంగారానికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఎన్నికలకోడ్ దృష్ట్యా పెద్ద మొత్తంలో బంగారం లభ్యం కావడంతో ఇన్ కం ట్యాక్స్ అధికారులకు పంపిస్తున్నామని పశ్చిమ గోదావరి ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు.

Other Articles

3 Comments

  1. Excellent post. I was checking constantly this blog and I’m impressed! Extremely useful info specially the last part 🙂 I care for such info a lot. I was seeking this certain info for a long time. Thank you and best of luck.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *