జీఎస్టీ అధికారిపై ఏసీబీ దాడి వెనుక అసలు నిజాలివిగో..!!

December 1, 2018 | News Of 9

The Facts in ACB raids on GST officer in Machilipatnam Newsof9

 .   ప్రజలకు చెప్పేది ఒకటి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిది ఒకటి

. మభ్యపెట్టడమే… చంద్రబాబు బలం

అమరావతి: సీబీఐకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు… కేంద్రంపై యుద్ధాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ దిశగా తొలి బాణాన్ని సంధించారు కూడా. దీనిని తెలుగుదేశం ప్రభుత్వం తమ గొప్పగా చెప్పుకుంటున్నా… వాస్తవానికి జరిగింది ఏమంటే అవినీతికి పాల్పడిన అధికారులు కొందరిని చంద్రబాబు ప్రభుత్వం రక్షించింది. వ్యవస్థలను నాశనం చేయడం ఇది కాదా అన్నది ప్రశ్న.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా రమణేశ్వర్ పని చేస్తున్నారు. జీఎస్టీ పన్నులను సరి చేసేందుకు ఒక ఐరన్ వ్యాపారి నుంచి ఆయన లంచం డిమాండు చేశారు. ఐరన్ వ్యాపారి నుంచి రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి.

అసలు ఏం జరిగిందంటే..?
ఈ కేసు గురించి పూర్తి సమాచారాన్ని సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. లంచం అడిగింది కేంద్ర ప్రభుత్వ అధికారి కావడంతో బాధితుడు ముందు విశాఖపట్నంలో ఉన్న సీబీఐ అధికారికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కేసుల్ని దర్యాప్తు చేసేందుకు అనుమతిని రద్దు చేసినందున, సీబీఐ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాసింది. చూడటానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతాపాన్ని చూపించడంలో కేంద్రం కంటే ఒక అడుగు ముందే ఉంది కానీ… ఈ కేసుకు సంబంధం ఉన్న కొంత మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం తప్పించిందని అర్థం అవుతున్నది. నవంబరు 28న ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదు విశాఖపట్నంలోని సీబీఐ కార్యాలయానికి అందింది. అదే రోజు దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీబీఐ అధికారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అవసరమైనపుడు సహకరిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ పంపిన లేఖపై స్పందించకుండా మౌనం వహించింది. ఏసీబీకి సమాచారం ఇవ్వక ముందే రాష్ట్ర ప్రభుత్వం అందులోని వివరాల ప్రకారం కొంతమంది అధికారులనూ, వ్యాపారులనూ రంగం నుంచి తప్పించింది. ఆశ్చర్యం ఏమంటే… వడ పోసి ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ ఒక్క అధికారిని మాత్రమే పట్టుకుంది. చాలా మంది అధికారులు దొరకాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కొంత మందిని వదిలేసిందని సీబీఐ చెబుతోంది. ‘‘అవినీతిలో ఇరుక్కున్న వారు తప్పించుకున్నారు. ఏసీబీ ఒక్క అధికారినే పట్టుకున్నది. ఈ కుంభకోణంలో చాలా మంది ఉన్నారు’’ అని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దీనదయాళ్ మీడియాకు చెప్పడం విశేషం.

తెలుగుదేశం పార్టీతో అంటకాగుతున్న అధికారులనూ, వ్యాపారులనూ తెలుగుదేశం పార్టీ  ఈ తరహాలో లోపాయికారీగా సహకరిస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏ ఆధారంలేని, బలహీనులను పట్టుకోవడం తప్పించి.. తెలుగుదేశం చెప్పే కబుర్లన్నీ ప్రజల్ని మభ్యపెట్టడానికేన్నది నిజం.

ఏసీబీ కూడా దీనిపై వివరణ ఇచ్చింది. కానీ ఈ వివరణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నట్లే ఉంది. రాష్ట్ర  ప్రభుత్వ వివరణ చూడండి.

‘‘సీబీఐ, ఏసీబీ మధ్య చక్కని సమన్వయం, సహకారం ఉంది. అందువల్లనే అవినీతి అధికారిని ట్రాప్ చేయగలిగాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలు బయటపెట్ట వద్దని సీబీఐ ఇచ్చిన లేఖలోనే పేర్కొన్నారు. ఏసీబీ ఎప్పుడూ ఫిర్యాదు దారుడి వివరాలను గోప్యంగా ఉంచుతుంది. ఆ ఫిర్యాదుదారుడు సీబీఐ అయినప్పటికీ అవినీతిని అంతమొందించడంలో ఏసీబీ… సీబీఐకి ఎప్పుడూ సహకారం అందజేస్తారు. అలాగే సీబీఐ నుంచి కూడా అదే తరహా సహకారాన్ని ఆశిస్తున్నాం’’ అని ఏసీబీ పేర్కొన్నది. అవినీతికి పాల్పడే అధికారుల విషయంలో వారు కేంద్ర అధికారులైనా, రాష్ట్ర అధికారులైనా ఉపేక్షించకూడదు అన్నది రాష్ట్ర ప్రభుత్వ విధానం’’ అని చెబుతున్నది రాష్ట్ర ప్రభుత్వం.

పరస్పర… సహకారంతో అవినీతి అధికారులను పట్టుకుంటామని ఏసీబీ చెబుతున్నది బాగానే ఉంది. కానీ.. ఇది చిలికి చిలికి గాలివానగా మారి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద వివాదంగా మారుతుందేమోనన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. చంద్రబాబు ఇప్పటికే కేంద్రంపై కాలుదువ్వుతున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేక మరో వివాదంగా మారుతుందా అన్నది వేచి చూడాలి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *