అన్నం దొంగలు ఎవరు?

November 22, 2018 | News Of 9

Chandrababu | telugu.newsof9.com

 • బడుగు జీవుల పొట్టగొడుతున్న ‘‘గ్రాండ్ డిజైన్’’
 • విద్యార్హతలు ఉంటాయి. కానీ అవకాశాలు రావు
 • తెలివితేటలు ఉంటాయి… కానీ ఏమీ చేయలేం
 • డబ్బు కళ్ల ముందే ఉంటుంది… కానీ పైసా చేతికి రాదు
 • మన కులమే మనల్ని దెబ్బతీస్తోందా అన్న నిస్పృహ ఉందా?
 • అయితే మీరు దోపిడీకి గురవుతున్నట్లే…!!
 • అయితే, ఈ స్టోరీ మీ కోసమే. చదవండి!!

పాలక వర్గాలది దొంగవేషం…. కోట్లూ, నోట్లూ, ప్రభుత్వ భూములూ అన్నీ వారికేనంటాయి. మీ ఓట్లూ మాకే అంటూ ఓ నోటు పారేసి గుంజుకుంటాయి. ప్రజలకు మాత్రం అన్నా క్యాంటీన్లు పెట్టి… మదర్ థెరెస్సాలా ముఖం పెడతాయి. ఇదంతా… ఓ గ్రాండ్ డిజైన్!!

(న్యూస్ ఆఫ్ 9 ప్రత్యేకం)

తాడిత పీడిత జనుల జీవితాల్లో స్వాంతంత్య్రం ఎప్పుడు? దేవుడు లేదా ప్రకృతి అందరినీ ఈ భూమి మీదకు ఒకేలా పంపినపుడు.. సామాజిక జీవనం అందరికీ ఒకేలా ఎందుకు లేదో చెప్పడం దేవుడు మర్చిపోయాడా? ఎందువల్ల? సమాజంలో రెండే వర్గాలు ఉన్నాయి. ఒకటి దోపిడీ చేసేది. రెండోది దోపిడీకి గురయ్యేది. అందుకు ప్రధాన ఆలంబన రాజకీయాలు.. ఆయా పార్టీలు. ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వానికీ, దోపిడీకి వ్యతిరేకంగా మార్పులు వస్తున్నా మన దగ్గర దళిత బడుగు బలహీన వర్గాలు ఆర్థిక, సామాజిక దోపిడీకి గురవుతూనే ఉన్నాయి. ఇందుకు కారణాలను సరిగా అర్థం చేసుకోకపోవడం కానీ, ఒకవేళ అర్థమైనా ఆవహించిన నిస్తేజంగానీ వారిని కార్యాచరణకు పూనుకోనివ్వడం లేదు. నవయుగ వైతాళికుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఎడ్యుకేట్… ఏజిటేట్. రెండే మార్గాలు. తెలుసుకోవడం, పోరాడటం. మనం ఉద్యమించాలంటే.. ఇక్కడ చీకటి మాటున ఏం జరుగుతున్నదీ ముందు స్పష్టంగా తెలుసుకోవాలి. 90 శాతం మంది ప్రజా జీవితాల్లో క్రాంతి కోసమే ‘‘న్యూస్ ఆఫ్ 9’’ పని చేస్తోందని ఈ సందర్భంగా మేం చెప్పదలచుకున్నాం. మిగిలిన 10 శాతం మంది కోసం లెక్కకు మిక్కిలి మీడియా సంస్థలు పని చేస్తున్నాయన్నది బహిరంగ రహస్యమే.

ఆ గ్రాండ్ డిజైన్ ను బద్దలు కొడదాం!!

సీపీఎం పార్టీకి రాఘవులు ఉంటారు.. తమ్మినేని వీరభద్రం ఉంటారు. సీపీఐకి నారాయణ ఉంటారు. తప్పితే చాడ వెంకటరెడ్డి ఉంటారు. టీడీపీకి నారా చంద్రబాబు ఉంటారు. బీజేపీకి ముత్తవరపు వెంకయ్య ఉంటారు. మీడియాకి చెరుకూరి రామోజీరావు, వేమూరి రాధాకృష్ణ ఉంటారు. జర్నలిస్టు ప్రముఖులుగా ఇనగంటి వెంకట్రావులు, వేమూరి రాధాకృష్ణలు ఉంటారు. (మిగిలిన కులాలు పెట్టుబడిదారీ సంస్థల్లో రాత కార్మికులుగా మనుగడ సాగిస్తున్నారు). మీడియా యజమానులుగా నరేంద్రనాధ్ చౌదరీలు (ఎన్టీవీ) చిగురుపాటి జయరామ్ (ఎక్స్ ప్రెస్ ఛానెల్- ప్రస్తుతం మూతపడింది), చలసాని వెంకటేశ్వరరావులు (సీవీఆర్ ఛానెల్స్), చంద్రబాబు బంధువులు విజయ్ కుమార్ (అమ్మా భగవన్- స్టూడియో ఎన్)లు, ఉంటారు. సీవీసీ అధినేతగా కె.వి.చౌదరి ఉంటారు. క్రిస్టియన్ సంస్థకు జోసెఫ్ సుధీర్ రెడ్డి తుమ్మా ఉంటారు. విజయవాడలో ఆరెస్సెఎస్ శాఖకు ఒక చౌదరి ముఖ్యుడుగా ఉంటారు. పారిశ్రామికవేత్తలుగా ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్, ముళ్లపూడి దత్తు, సుజనా చౌదరి, నవయుగ విశ్వేశ్వరరావు, నిమ్మగడ్డ ప్రసాద్, నారా లోకేష్ లు వంటి వారు మాత్రమే ఉంటారు. బడుగు బలహీన వర్గాల నుంచి పారిశ్రామికవేత్తలు ఒకటీ… అరా తప్పితే పెద్దగా కనిపించరు. కారణాలు ఏమిటి అన్నది ఆలోచించారా?

ఇలా ఏ పార్టీ చూసినా, ఏ వ్యవస్థ చూసినా ఆర్ధికంగా దన్ను ఉన్న ఒకటి రెండు సామాజిక వర్గాలే ఉన్నాయి. ఇదంతా వాళ్ళు మేధావులు… వాళ్లకు అర్థమైనంతంగా కమ్యూనిజమో, హేతువాదమో, నాస్తిక వాదమో, వ్యాపారమో, రాజకీయాలో మిగిలిన వారికి అర్థం కాలేదు అనుకుంటే మీరు సమాజాన్ని సరిగా అర్థం చేసుకోలేదనే. దళిత బడుగు జనుల్లో కమ్యూనిజంలో మేథావులు లేరా? అగ్రకులాలకే అన్ని రాజకీయ సిద్ధాంతాలు అర్థం అవుతాయని మీరు ఇంకా నమ్మితే.. బడుగు బలహీన వర్గాలు అభివృధ్ధి చెందడానికి మరో 100 ఏళ్ళు పడుతుంది. కమ్యూనిజం ఇక్కడ విఫలం కావడానికి కారణం వాళ్లను ప్రజలు నమ్మకపోవడమే. ఎందుకు నమ్మరు అంటే.. వాళ్లూ కులాన్ని పాటిస్తారు. తొలి తరం విప్లవకారులు విప్లవోద్యమాల నుంచి బయటకు రావడానికి కులమే కారణమని తెలుసా? రాత్రిపూట ఆయుధాలు దళిత విప్లవకారుల దగ్గర ఉండరాదని సీపీఐఎంఎల్ (మావోయిస్టులు)లో ఒక అలిఖిత శాసనం ఉండేది. విప్లవంలోనూ కులం ఉన్నపుడు ఇంకేమి విప్లవం అంటూ అనేక మంది దళిత విప్లవకారులు ఆయుధాలు వాళ్ల మొఖాన కొట్టి బయటకు వచ్చేశారు.

‘‘మీరు దళితులు.. విప్లవం అంటే మేం చెబుతాం’’ అని రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ విప్లవకారులు (?) భావించినపుడు విప్లవం ఎందుకు వస్తుంది? అందుకే సాయుధ పోరాటం మన దగ్గర రాకుండా పోయింది (ఇదీ వేరే చర్చ). అడవులు కాకుండా మైదానాల్లో దోపిడీ ఎలా జరుగుతుందన్నదే చూద్దాం. కమ్యూనిస్టులూ కులపెద్దలుగా విరాజిల్లుతున్నపుడు… పెట్టుబడిదారీ పార్టీలకు ఓటేస్తే తప్పేమిటి అని ప్రజలు భావించారు. ఇపుడు తెలుగుదేశం, కాంగ్రెసు వంటి పార్టీల వెనుక తాత్కాలిక ప్రయోజనాలైన దక్కుతాయి కదా అన్న బలహీనతతో బలహీన వర్గాలూ వారి వెనుక పరుగులు తీస్తున్నాయి. ఆకలి గురించి కేకలు పెట్టే పనిని ఆకలిగొన్నవాడే చేయాలి. ముప్పూటలా తిండి తిని, వేల ఎకరాలు కాజేసి, కార్లలో తిరేగేవాడు ఆకలి వేస్తున్న వాళ్ల కోసం ఉద్యమం చేస్తానంటే అందులో చిత్తశుద్ధి ఉంటుందా? దోపిడీకి గురైన వాడే దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయగలడు. దోపిడీ చేసుకునే వాడు.. ఏం చేస్తున్నాడంటే.. నీ తరఫున నేను పోరాటం చేస్తాను అంటున్నాడు. నీ తరఫున నేను వార్తలు రాసి పెడతానంటాడు. నీకు పోరాటం చేయాలంటే పార్టీ ఉండాలంటాడు. పత్రిక ఉండాలంటాడు. నీకు మార్క్కిజం తెలియదంటాడు. న్యూనతకు గురి చేస్తాడు. అన్నీ మాకు ఉన్నాయి కాబట్టి.. మీరు మా వెనకే ఉండండి… మేం పోరాటం చేస్తాంగా అంటాడు. కమ్యూనిస్టులు తెలుగుదేశంతో లాలూచీ పడిపోతారు. తెలుగుదేశం.. సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెసుతో కలిసిపోతుంది. అదే మంటే డెమోక్రాటిక్ కంపల్షన్ అంటూ ఒక ముసుగు వేస్తారు. మనం ఏం చేస్తాం? అవును కామోసు అనుకుని బలహీన వర్గాలు మౌనంగా చూస్తుండిపోతాయి. ఈ పట్టపగలు దోపిడీ వల్ల ఆయా వ్యవస్థల వెనుకున్న వారు జేబులు నింపుకుంటున్నారు. ఆకలితో ఉన్నవాడు ఆకలితోనే ఉంటున్నాడు. పొట్ట నిండినవాడు.. ఆకలిగొన్న వాడిని దేశం పేరు చెప్పో, దేవుడు పేరు చెప్పో, టీవీ ఛానెళ్ల ముసుగులో దీపోత్సవాలు చేసో … జొజ్జరగొడుతున్నాడు. నిమ్న వర్గాలను నిర్వీర్యం చేస్తున్నారు. అలా బలహీనం చేసి వదిలేస్తున్నారు. ఇంకా వెనక్కి… ఇంకా వెనక్కి… ఎన్నాళ్లు..?

ఈ దోపిడీ వర్గాలపై దాడి చేస్తున్నందునే… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలా జీరో చెయ్యాలా అని పెట్టుబడిదారీ వర్గాలు, కోట్ల రూపాయలను అలవోకగా గుమ్మరించగలిగిన టీవీ ఛానెళ్లు ఆలోచిస్తున్నాయి. కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావును తాట తీస్తానని ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా ఇంత వరకూ ప్రశ్నించిందా? ఏం? ప్రజల తరఫున ఇపుడున్న పార్టీలు ఎందుకు ఉద్యమించవు? గ్రాండ్ డిజైన్ గురించి చెప్పుకున్నాం కదా. కులం ముసుగులో అందరూ ఒకటే. జనసేన అధినేత పవన్ కులం గురించి మాట్లాడతాడేమిటి అని ఒకరు ప్రశ్నించారు. ఎవరు కులం పేరుతో నష్టపోతున్నారో వాడే కులం గురించి మాట్లాడతాడు. కులం పేరు చెప్పి లాభాలు దండుకునేవాడు మౌనంగా ఉంటాడు. కులమూ లేదు గిలమూ లేదు. అంతా సమానమేనంటాడు. ఎలా సమానం? పదేళ్ల కిందట సైకిలుపై వచ్చిన ఓ జర్నలిస్టు నేడు నెలకో కారు కొనుక్కుని తిరుగుతున్నాడు. ఈ పెట్టుబడిదారుడూ… సాయంత్రం అన్నం ఎలా అని ఆలోచించేవాడూ ఒకటే ఎలా అవుతారు. ఇద్దరికీ స్నేహం కుదురుతుందా?

కులం పోవాలని అంబేద్కర్ చెప్పాడు. మార్క్కు కూడా చెప్పాడు. ఆర్థిక సమానత్వమే కులాన్ని తీసివేయగలదని ఇప్పటి వరకూ దార్శనికులు చెప్పింది. ఆర్థిక సమానత్వం రావాలంటే అగ్రవర్ణాల దోపిడీ ఆగాలి. అందుకే పవన్ కళ్యాణ్ కులం గురించి పదే పదే మాట్లాడుతున్నాదని మా భావన. లేదంటే… పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి… అదిగో చూశారా ఆయన పక్కన అంతా కాపులే ఉన్నారంటగా.. అంటూ జర్నలిస్టులు చెబుతారు. నేటి జర్నలిస్టులకు సమాజంపై ఉన్న అవగాహన తక్కువ. లేదా వారు కూడా సమాజంలోని అసమానతలకు అసలు కారణాలను వెలికితీయలేదనే అర్థం.

ఎన్టీరామారావు ఉన్నపుడుగానీ, ఇపుడు నారా చంద్రబాబు ఉన్నపుడుగానీ వారి చుట్టూ ఉన్నదెవరు? ఎన్టీరామారావును ఆదరించింది… కోస్తా జిల్లాల్లో రైసు మిల్లులూ, సినిమా హాళ్లూ కట్టుకున్న కమ్మవారేనని పౌర హక్కుల సంఘం నేత, గణిత మేథాావి డాక్టర్ బాలగోపాల్ విశ్లేషించారు. 

ఈనాటి రాజకీయ నాయకులందరూ అంబేద్కర్ విగ్రహాలకు దండ లేస్తారు. దండం పెడతారు. కానీ నిజంగా అంబేద్కర్ ఇపుడు ఉంటే.. ఆ మహానుభావుడితో మాట్లాడటానికి భయంతో వణికిపోరూ? పవన్ కళ్యాణ్ కాపు కాబట్టి.. అదిగో ఆయన పక్కన కాపులు ఉన్నారు.. చూశారా అంటున్నారు. పవన్ కళ్యాణ్ సమానత్వం గురించి మాట్లాడుతున్నాడు. అతని భాష ఆకలి గొన్న వాడి భాష. కడుపు కాలుతున్న వాడి భాష. పెట్టుబడిదారుకు మంటెత్తే భాష. అందుకే పవన్ అంటే నచ్చడం లేదు. మంచికో చెడుకో. పవన్ విప్లవాన్ని ఇష్టపడతాడు. చేగువేరా నుంచి స్ఫూర్తిని పొందిన వారు ఇలాగే ఉంటారు. చేగువేరా ఫోటో చూస్తే సమ సమాజాన్ని కోరుకునే యువతకు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఒకప్పుడు ఎరుపు రంగు చూసినా అలాగే ఉండేది. కమ్యూనిస్టులు వచ్చిన ఎరుపు రంగు వెలిసిపోయింది. పవన్ కళ్యాణ్ ఆదర్శాలు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. అవి లోక్ సత్తా నేత నాగభైరవ జయ ప్రకాష్ నారాయణ్ చెప్పిన సూక్తుల వంటివి కానే కావు. పెట్టుబడిదారీ వర్గాలను కూలదోసే మాటలు. కాదు కాదు.. ఈటెలు. ఆ మాటల తీవ్రత పెట్టుబడిదారీ పత్రికలూ, టీవీ ఛానెళ్లు చూసే వారికి వెంటనే అర్థం కాకపోవచచ్చు. వాళ్లు ఆకలిగొన్న వాళ్లను అయోమయంలోకి నెడతారు. పెట్టుబడిదారులకు మాత్రం పవన్ మాటల తీవ్రత తెలుసు. అందుకే ఏదో ఒక మార్గంలో ఆయన్ను దెబ్బకొట్టాలనే చూస్తున్నారు. ఎక్కడో గుబులు.. ఎక్కడో శంక. వారిని నిద్రపోనివ్వదు.

ఇపుడున్న కాలంలో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించడం అసాధ్యం కనుక… బ్యాలెట్ నే బుల్లెట్ గా వాడమంటున్నాడు పవన్. డాక్టర్ అంబేద్కర్ విగ్రహాల్లో వేలు చూపిస్తున్నది ఓటు అనే ఆయుధం అని ఆయన చెప్పకనే మనకు చెబుతున్నాడని అంటున్నాడు పవన్. ఎంత చక్కటి ఆలోచన. ఇజాలనూ,సిద్ధాంతాలను, కులాన్నీ పక్కన పెట్టి.. తెలంగాణ పోరాటం చేశారు. సాధించారు. ఇపుడు తెలంగాణ ప్రజ ఏం ఆలోచిస్తున్నది? తెలంగాణకు మంచి చేసేవాడిని ఉంచుతాం. లేదంటే మరొకరిని తెచ్చుకుంటాం అంటున్నది. ముందు దోపిడీ చేసేవాళ్లు పోతే… వెలుగు వస్తుంది. ఆ వెలుగుల్లో ఎవరు మంచి.. ఎవరు చెడ్డ ఆలోచించుకోవచ్చు. చరిత్ర ఎప్పుడూ ఒక అవకాశాన్ని ఇస్తుంది. ముందు స్తబ్దతను అది  చెదరగొడుతుంది. పవన్ రూపంలో ఇపుడు అదే జరిగింది. ఆకలి గొన్న వారి కోసం ఆకలి ఉన్నవాళ్లే ఉద్యమించే తరుణమిది. కాదంటారా?

Other Articles

5 Comments

 1. cinimalu ammukunte party lu blood ammukutunna valla nu question cheyyi
  Anna Cong ki
  TAMMUDU bjp ki
  Valla into yevaranna kapu balija pillalini marraige chesukunnadu dalitalu la pillalani chesukunnadu velakotlu dobbi fans nu sontha caste nu munchinavalla gurinchi rayamaaku ashyamuga untundi
  Vaadiki oka maharashtrian oka Russian oka Punjabi kaavali malli vaadu viplavalu cheguveera antadu kotlu deals chesukunnadu .
  Teesina movies no MESSAGES gali veshalu gali chestalu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *