టీడీపీ, వైసీపీ అసలు బలం ఎంత? కొన్ని వాస్తవాలు..!!

April 10, 2019 | News Of 9
TDP-YCP | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

ఏపీ 13 జిల్లాల అసెంబ్లీ స్థానాలు 175. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచింది 140 సీట్లు.. 2009 ఎన్నికల్లో గెలిచింది 107 స్థానాలు. 2014లో ఆయన కుమారుడు జగన్.. తన తండ్రి పేరు చెప్పుకుని గెలిచిన స్థానాలు 67. 2004- 140.. 2009- 107.. 2014- 67.. మరి 2019: ? 125, 150, ఇవీ వైసీపీ సర్వేలు చెప్పే ఫలితాలు. టీడీపీ తరపు మీడియా కూడా ఇవే అంకెలను తారుమారు చేసి చూపిస్తుంది. అంతే కానీ ఎక్కడా జనసేన ఉనికి ఉండదు.

వైఎస్సార్ ప్రభావం ఎలా తగ్గుతూ వస్తోందో పై రిజల్ట్ చెబుతోంది.. ఇది నిజమా కాదా? ఓసారి చెక్ చెయ్యండి.

మరి ప్రజలందరూ మమ్మల్నే కోరుకుంటున్నారు. అంటూ పెయిడ్ సర్వేలతో ఊదరగొడుతున్న వాళ్ళను, వాటిని నమ్మే వాళ్ళను ఏమనాలి. ఇలాంటి సర్వేలను. ఆలోచన, అవగాహన, విశ్లేషణ ఉన్న వారెవరైనా నమ్ముతారా? నమ్మరు. సదరు నాయకులు ఎన్ని సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. ఎన్ని సార్లు ప్రకృతి విపత్తుల సమయంలో తమకు అండగా పోరాడారు అని చూస్తారు.

సరే జగన్ గెలుస్తాడని అనుకోగాలరా.. తండ్రి చనిపోయాడన్న సానుభూతి ఇప్పటికీ ఉందా.. మరి యాత్ర సినిమా ఎందుకు ఆడలేదు. అదంతే జగన్ మీటింగులకు ఎండలో నిల్చుంటారు. కానీ వైఎస్సార్ సినిమాను ఏసీ థియేటర్ లో చూడడానికి రారు. అంటే డబ్బిస్తేనే వస్తారా. జగన్ ఈ మధ్యకాలంలో ఏమైనా ప్రజా సమస్యలను అసెంబ్లీలో పోరాడి పరిష్కరించారా? లేదు. ఎలక్షన్ కోసం ఓ ప్లాన్ ప్రకారం పాదయాత్ర చేశారు. 2 ఏళ్లుగా అసెంబ్లీకి రావడం లేదుకదా.. మేము జీతాలు తీసుకోము. ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటాం. అని ఏమైనా సవాలు విసిరారా? లేదు. చక్కగా జీతాలు తీసుకుంటూ,అన్ని సదుపాయాలు వాడుకుంటూ, సొంత ప్రచారం చేసుకున్నారు.

ఈ పరిస్థితులలో జగన్ పార్టీయులు ఎవరైనా గెలిస్తే కొందరు అమాయకుల ఓట్లతోనో, లేక డబ్బుకు తమ ఓటు హక్కును అమ్ముకునే వారి వల్లో అవ్వాలి కానీ.. ప్రజలు నమ్మి గెలిపిస్తారని ఎలా భావిస్తారు. జగన్ ఎంత సీనియర్ నాయకుడో మీకు తెలియదు. సీనియర్ జర్నలిస్టులకు అంతకు ముందు నుంచీ ఆయన నాయకత్వ ప్రతిభ తెలుసు.. అందుకే సందర్భం వస్తే చాలు జగన్ లో కమిట్మెంట్ ఉందంటూ జనానికి ఎక్కించేస్తున్నారు. అందులోని వాస్తవాలు వారి మనసాక్షికే తెలియాలి.

ఇక టీడీపీ 2009లో ఏపీలోని 13 జిల్లాల్లో గెలుపొందినవి 53 స్థానాలు. కానీ 2014లో 102 స్థానాలు గెలిచారు. అయితే ఎలా ఎవరి వల్ల 100 శాతం ఎక్కువ స్థానాలు గెలిచారో.. వాళ్ళకీ తెలుసు. ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతు అడగడానికి తండ్రితోపాటు వెళ్ళిన లోకేష్.. ఈ ఎన్నికల్లో మేము గెలవక పోయినా.. మాకు అండగా ఉంటారా? అని ప్రాధేయపడ్డారని పవన్ అన్నారు. అంటే అప్పటికి వారి కెపాసిటీ ఏమిటో స్పష్టంగా అర్థం అవుతోంది.

ఇక ఈ ఎన్నికలలో ఎలా దూసుకుపోతున్నారో మీ నియోజక వర్గాల్లో టీడీపీ పార్టీ నాయకుల అవస్థలు చూస్తే అర్థమవుతుంది. ఎవరూ చెప్పాల్సిన పని లేదు.

వైఎస్సార్ అధికారంలో ఉండగా జగన్ వేల కోట్లు సంపాదించాడు. ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి గనుక లోకేష్ సంపాదిస్తున్నాడు. అంటే అధికారంలో ఉన్నవారే సంపాదిస్తున్నారు. అందుకే అధికారం కోసం పోటీ పడుతున్నారు. అప్పట్లో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు, హత్య కేసుల్ని వైఎస్సార్ మాఫీ చేశాడని లక్ష్మీ పార్వతి అంటున్నారు. అంటే తమలో ఎవరికి కష్టం వచ్చినా మరొకరు ఆదుకుంటారు. ఇవే వారి రాజకీయాలా? ఇక తాజాగా ఇసుక దందాల్లో టీడీపీ, వైసీపీ 60:40 వాటా అంటున్నారు. అంటే వారంతా ఒకటే. మధ్యలో జనమే వెఱ్ఱివాళ్ళు.

ఇక్కడే పౌరులు జాగ్రత్తగా గమనించాలి. ఈ వ్యవస్థ నడిచేది డబ్బున్న వాళ్ళను కాపాడి, సామాన్యులను నిర్లక్ష్యం చేయడానికే.. అన్నట్లు సాగుతోంది పరిస్థితి. ఈ ఓటు రాజకీయాల్ని అర్థం చేసుకోండి. అంత త్వరగా మార్పు రావడానికి వారెవరూ సిద్ధపడరు. ప్రజాధనం పంచడానికి, పంచుకోవడానికి ఉండే అధికారాన్ని వదలదానికి ఇష్టపడరు. మూడో ప్రత్యామ్నాయంగా వస్తున్న జనసేనను అడ్డుకోడానికి ఇదే కారణం. ఒక ఆకస్మాత్ పరిణామంతో ప్రజలే మార్పును తెచ్చుకోవాలి. అడుగు ముందుకు వెయ్యాలి. అడ్డంకులొస్తాయి, వెనుకంజ వెయ్యకపోతే విజయమూ వరిస్తుంది. మన దేశం, మన రాష్ట్రం, మన సంపద, మనమే కాపాడుకుందాం.. మన ఓటుతో, ఓ గట్టి సంకల్పంతో.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *