కీలక అడుగు: గవర్నర్ ను ప్రజాకూటమి ఎందుకు కలిసిందో తెలుసా?

December 10, 2018 | News Of 9

 

హైదరాబాదు: ఏ పార్టీకి అధికారం వస్తుందో తెలియడానికి మరికొద్ది గంటల సమయం ఉంది. అయితే లోగానే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న ధీమాను వ్యక్తం చేయడమే కాకుండా, ఇకవేళ తమకు ఎక్కువ సీట్లు లభిస్తే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరడానికి ప్రజా కూటమి నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్ ను కలిశారు. తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీల ప్రతినిధులందరూ కలిసి గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.

సంకీర్ణంగా ఎన్నికలకు ముందే ఏర్పడ్డామని ప్రతినిధుల బృందం గవర్నర్ కు రాతపూర్వకంగా చెప్పాలని భావిస్తోంది. ఇందుకు ముఖ్యమైన కారణం లేకపోలేదు. అందువల్ల చాలినన్ని సీట్లు వస్తే… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజాకూటమిని ఆహ్వానించాలని ప్రతినిధి బృందం కోరనున్నది. తొలి ప్రాధాన్యం కూడా తమకే ఇవ్వాలని కూడా వారు గవర్నర్ కు విన్నవిస్తారు. తెరాస కంటే ఏమాత్రం తమకు ఆధిపత్యం ఉన్నా సరే, తమను ఆహ్వానించాలని కోరతారు. కర్ణాటకలో ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ప్రజా కూటమి నేతలు ఈ చర్య తీసుకున్నారు. కాంగ్రెసు-జనతాదళ్ (సెక్యులర్)కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ ఉన్నా… గవర్నర్ ఈ కూటమిని ముందు ఆహ్వానించలేదు. దీనికి కారణం. ఎన్నికలకు ముందే.. ఈ రెండు పార్టీలూ కూటమిగా ఏర్పాడనందున దానిని గవర్నర్ గుర్తించలేదు. అతి పెద్ద పార్టీగా భాజపా ఉందని, భాజపానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. కాంగ్రెసు-జేడీఎస్ కూటమి ఎన్నికల తర్వాత మాత్రమే ఏర్పడిందన్నది వాస్తవం. దీనిని దృష్టిలో ఉంచుకునే.. ప్రజా కూటమి నేతలు ముందే గవర్నర్ ను కలిసి.. ఎన్నికలకు ముందే తాము కూటమిగా ఏర్పడిన విషయాన్ని వివరించారు. ఇదే విషయాన్ని వారు రాతపూర్వకంగా గవర్నర్ కు నివేదించారు. ఒకే పార్టీగా తెరాసకు భారీ మెజారిటీ వచ్చినా… కూటమిగా తమకు ఎక్కువ సీట్లు ఉంటే తమనే పిలవాలన్నది ప్రజా కూటమి అభిప్రాయంగా ఉంది. గవర్నర్ ను కలిసిన వారిలో పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్.రమణ, కోదండరామ్ తదితరులు ఉన్నారు.

అలాగే, హంగ్ ఏర్పడినా… గెలిచిన అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని కూడా గవర్నర్ కు విన్నవించారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *