ఇలా ‘‘గానుగ’’ ఆడేశారు… !!

January 31, 2019 | News Of 9

70 ఏళ్ల ఊడిగానికి మూలాలు- పార్ట్ 02

గమనిక: ఈ ఫోటోను ప్రతీకాత్మకంగా వాడిందేనని గమనించగలరు. వాస్తవమైనది కాదు.

చెరకు…

ఈ మాట వినగానే చాలా మందికి తీపి జ్ఞాప‌కాలు గుర్తుకొస్తాయి.

చరిత్ర తెలిసిన వారికి గుండెలు కరిగి నీరైపోతాయి.

కారణం.. చెరకు పంట వెనుక పెద్ద కన్నీటి చరిత్ర ఉంది.

బానిస వ్యవస్థను సృష్టించిందే ఈ చెరకు.

పాశ్చాత్యదేశాల్లో ఈ చెరకు పొలాల్లో పని చేసేందుకే ఆఫ్రికా నుంచి బానిసలను కొని తెచ్చేవారు. ఆ హింస గురించి అందరికీ తెలిసిందే. అయితే… మన దేశంలో.. మన రాష్ట్రంలో… కేవలం 4 శాతం మాత్రమే ఉన్న కమ్మవారు 90 శాతం సామాజిక వర్గాలను ఒక ఆట ఆడించడానికీ, బడుగు బలహీన వర్గాలను ఒక కాలికింద తొక్కి పట్టడానికి బాటలు వేసింది చెరకు. దాని వెనుక ఉన్నది కమ్మ భూస్వామ్య జమిందార్లు. ఇక చదవండి…

‘‘అణచివేత’’ అడుగుజాడలివే…!!

కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలే నేటి తరం రాజకీయాలను గుప్పిట్లో ఎందుకు పెట్టుకున్నాయి? చరిత్ర కొంత తెలిస్తే తప్ప.. ముందుకు ప్రయాణం సాగించడానికి దారి దొరకదు. అందులో ముందు కమ్మ సామాజిక వర్గం ఏం చేసింది? వారి ఆలోచనలు ఎలా సాగాయో తెలుసుకోవడం ముఖ్యం. కమ్మ సామాజిక వర్గం ప్రభ ఒక వెలుగు వెలిగిపోవడానికి తొలి బీజం వేసిన వ్యక్తి చల్లపల్లి రాజాగా ప్రసిద్ధుడైన యార్లగడ్డ శివరామ ప్రసాద్. జమిందార్ల,  బ్రాహ్మణులకున్న ఆధిపత్యాన్ని పునాదులను పెకలించివేయడానికి ఆయన ఆలోచనలే కారణం. ఆ ప్రయాణం ఎలాంటిది? అది ఏ రకంగా కమ్మ సామాజిక వర్గానికి స్ఫూర్తిని ఇచ్చిందన్నది ఈ కథనంలో చూడొచ్చు. తర్వాత కేసీపీ కంపెనీ కూడా కమ్మవారిలో ఇండస్ట్రియలిస్టులను తయారు చేయడానికి దోహదం చేసింది.

(మొదటి పార్టు-01 తరువాయి)

డెల్టా రైతుల వ్యాపార దక్షత గురించి వ్యవసాయంపై నియమించిన కమిషన్ 1926 నాటి నివేదికలో ఉంది. ‘‘రైతు పన్ను (కిస్తు) కట్టిన తర్వాత ధరలపై అతను కన్నేసి ఉంచుతాడు. ముఖ్యంగా బర్మా నుంచి వచ్చే బియ్యం దిగుమతిలపై అతను దృష్టి నిలిపేవాడు. ధరలేనపుడు వెంటనే పట్టణాలకు వచ్చి అమ్మేయాలని భావించేవాడు కాదు. డెల్టా రైతుల అలవాటు పురోగమంలో ఉణ్న కమ్మ రైతులు అందిపుచ్చుకున్నారు. గుంటూరు పొగాకు వ్యాపారంపై రైతు నేత ఎన్.జి.రంగా ఇలా అన్నారు: 1916 నుంచి పెద్ద రైతులు భారీగా పొగాకు పంటను కొనడం ప్రారంభించారు. పంట వేసే సమయంలోనే తక్కువ రేటుకు ఇతర రైతుల వద్ద కొనుగోలు చేసేవారు. ధరలు పెరిగే వరకూ ఎదురుచూసేవారు. దళారుల మధ్య రేట్ల యుద్దం మొదలైన తర్వాత కొనుగోలుదారుల కోసం రైతులు వెతుక్కునే పరిస్థితి తప్పింది. రైతుల వెంటే.. వ్యాపారులు పరుగులు తీయడం మొదలైంది. గ్రామాల్లో ఉండే కమీషను వ్యాపారుల నిర్ణయాలు తీసుకోవడం మొదలైంది. వ్యాపారానికి అనువైన వాతావరణం గుంటూరు తాలూకాల్లో… వర్జీనియా పొగాకు పంట సాగుకు దారివేసింది. తొలుత దీనిని బ్రిటీష్ అమెరికన్ టొబాకో (బీఏటీ) కోసం 1920ల నుంచీ సాగు చేశారు.

భారతదేశంలో సమష్ఠి వ్యవసాయానికి ఇదే ఆది కావచ్చు. విదేశీ కంపెనీ నారు అందించడం, సాంకేతికతను అందించడం, ముందే అంగీకరించిన రేటుకు ఉత్పత్తిని కొనుగోలు చేయడం అదే మొదలు. దేశీ ఆకును బీడీల తయారీకీ, ముక్కుపొడుం తయారీకి వాడేవారు. వర్జీనియా పొగాకు ప్రాసెసింగ్, మెళకువలు అన్నీ మనకు కొత్త. ఆకుపచ్చని ఆకుల్ని వేడి గదుల్లో (బారను) వేడి చేసేవారు. ఎండలో ఎండపెట్టడమే మనకు అప్పటి వరకూ తెలిసింది. 1930-1940 మధ్యకాలంలో పొగాకు బారన్లు 200 నుంచి 6 వేల వరకూ పెరిగాయి. డబ్బున్న రైతులే ఈ పొగాకు బారన్లను కట్టుకున్నారు. 1950ల మధ్యకాలంలో గుంటూరులో వర్జీనియా సాగు 50 వేల హెక్టార్లకు విస్తరించింది. 1971-75 నాటికి లక్ష హెక్టార్లకు పెరిగింది. దేశం మొత్తంలో ఉత్పత్తిలో 65 శాతం ఇక్కడి నుంచే వస్తోంది. పత్తి కూడా ఇదేవిధంగా వృద్ధి చెందింది. జిల్లాలో ఉత్పత్తి జాతీయ సగటు కంటే రెట్టింపు అయింది.

20వ శతాబ్దం తొలి దశాబ్దాల కాలంలో వరి, ఇతర వాణిజ్య పంటలయిన వర్జీనియా పొగాకు, పసుపు, మిరప సాగు ద్వారా వచ్చిన లభాల్ని వేరే ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి ధనికులైన రైతులు అవకాశాల కోసం వెదుకుతున్నారు. కొంతమంది ధాన్యం వ్యాపారంలోకి వెళ్లారు. ధాన్యం కొనడం, కమీషను తీసుకుని అమ్మడం.. రైసు మిల్లులకు విక్రయించడం. స్థానిక రైతుల డబ్బులతోనే.. అనేక మంది రైసు మిల్లుల్ని నిర్మించారు. గుంటూరు జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఔత్సాహికులైన కమ్మవాళ్లు ఉండేవారు. ఒక్కొక్కరికి 10 నుంచి 20 ఎకరాల పొలాలు ఉండేవి. వ్యాపారం చేయాలని వీరంతా తహతహలాడుతూ ఉండేవారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలుకు చెందిన ఎన్జీరంగా (ఈయన కూడా కమ్మనే) దీని గురించి రాశారు.  బ్రాహ్మణేతర సామాజిక వర్గాల్లో ఆధునిక విద్యను అందిపుచ్చుకున్నది కమ్మలే. 1931 జనాభా లెక్కల ఆధారంగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ఒక్క డెల్టావాసుల్లో అక్షరాస్యత శాతం వేగంగా పెరిగింది. 1925 నాటికి రాజమండ్రిలో అయిదు దినపత్రికలు 4,700 సర్క్యులేషన్ తో నడిచేవి. మసులీపట్నంలో కూడా అయిదు దినపత్రికలు ఉండేవి. వాటి సర్క్యులేషన్ 8,000 కాపీలు. ఇతర గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా కార్యక్రమాలు ఎక్కడా లేవు. డెల్టా ప్రాంతాల్లో డబ్బు ఇబ్బడిముబ్బడిగా ఉందని, దీనిని పిల్లల విద్యపై ఖర్చు చేయాలని 1933లో మద్రాసు బ్యాంకింగ్ ఎంక్వయిరీ వ్యాఖ్యానించింది. కమ్మవాళ్లలో… పారిశ్రామిక ఆకాంక్షలు జనించడానికి విద్య ఎంతో ఉపకరించింది. గ్రామాలు దాటి వారికి ఉన్న సంబంధాల కారణంగా గ్రామాలూ, పట్టణాలకు మధ్య వారు వారధిగా పని చేశారు. దేశం మొత్తంలో కంటే.. ఒక్క దక్షిణాదిన ఉండే ఆర్య వైశ్యులు (కోమట్లు) బలహీనం. ఉదాహరణకు ఏలూరుకు చెందిన మోతే కుటుంబాలు, కాకినాడ పైడాలు, గుంటూరుకు చెందిన మద్ది, మాజేటీలు.. కానీ ఈ గ్రూపులన్నీ పట్టణాల్లోనే ఉండేవి. ఉత్తరాదిన ఉన్న బనియాలు మాత్రం గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించి ఉన్నారు. ఈ పరిస్థితి ఇక్కడ లేదు. నీటిపారుదల వ్యవస్థ వచ్చిన తర్వాతనే.. కోమట్లు, అలాగే వలస వచ్చిన మార్వారీ (మార్వాడీ) కుటుంబాలు కొన్ని డెల్టా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. డిప్రెషన్ తర్వాత గుంటూరులో జరిగిన విచారణ ద్వారా వెల్లడైన విషయం ఏమంటే 87 శాతం మంది వడ్డీ వ్యాపారులు వ్వయసాయదారులేనని తేలింది. 1893-96 మధ్యకాలంలో కృష్ణాజిల్లాలో భూముల క్రయవిక్రాయలు కూడా వ్యాపారుల పెట్టుబడులన్నీ కూడా వ్యవసాయంలోకే వెళ్లాయి.

వ్యాపారులు మొత్తం భూముల్లో 10 శాతం వరకూ కొన్నారు. ఎన్జీరంగా చెప్పినట్లుగా ఔత్సాహిక కమ్మల దగ్గర పెట్టుబడి ఉంది, తగిన ఉత్సాహం ఉంది… కాబట్టి అక్కడ నుంచీ వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లోకి విస్తరించడం పెద్ద కష్టంగా అనిపించలేదు.

ఉత్తరాదిలో మాత్రం పరిస్థితి వేరు. డబ్బున్న, రాజకీయ అధికారం ఉన్న వ్యవసాయదారుల సామాజిక వర్గాలకు అక్కడి బనియా వర్గాలు పెద్ద అడ్డంకిగా కనిపించాయి. కానీ ఇక్కడ అలా కాలేదు.

కమ్మవారు… ఉవ్వెత్తున ఎగసిపడింది ఎప్పుడు?

ధనికులుగా మారిన కమ్మ రైతులకు 1930 వరకూ పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశం వడ్డీ వ్యాపారమే. లేదంటే వర్తకం లేదంటే రైసు మిల్లులు లేదా ఆయిలు మిల్లులు. గ్రేట్ డిప్రెషన్ టైం… టర్నింగ్ పాయింటుగా మారింది. గ్రామ ప్రాంతాల్లో రుణ వ్యవస్థ కుప్పకూలింది. మార్కెట్లో ధాన్యం, ఇతర అపరాల ధరలు తగ్గిపోవడడం… ఇవన్నీ కూడా పెట్టుబడులకు రక్షణ లేని పరిస్థితి వచ్చింది. గ్రేట్ డిప్రెషన్ కారణంగా.. సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం అన్వేషణ మొదలైంది. ధనికులైన జమిందారులు, ఎస్టేట్లు ఉన్న వారు ముందు ఈ ప్రయత్నాలు ప్రారంభించారు.

చల్లపల్లి జమిందారు.. యార్లగడ్డ శివరామ ప్రసాద్

కృష్ణాజిల్లాలో చల్లపల్లి జమిందారు.. యార్లగడ్డ శివరామ ప్రసాద్ పేరు ముందు చెప్పుకోవాలి. ఆంధ్రా బ్యాంకును ప్రారంభించింది బ్రాహ్మణుడైన భోగరాజు పట్టాభి సీతారామయ్య. స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడు అయినా.. ఆంధ్రా బ్యాంకు నవంబరు 1923లో ఏర్పడటానికి డబ్బులు సమకూర్చింది యార్లగడ్డ శివరామ ప్రసాద్. కమ్మవారి చరిత్ర రాసిన జర్నలిస్టు గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో 1938లో యార్లగడ్డ శివరామ ప్రసాద్ సారధి ఫిలింస్ ప్రారంభించారు. సారధి ఫిలింస్ బ్యానర్ పై అనేక తెలుగు హిట్లు వచ్చాయి. బ్రాహ్మణ కట్టుబాట్లు, కుల వివక్షలను నిరసిస్తూ 1938లో వచ్చిన మాలపిల్ల, రైతుబిడ్డ (1939) వంటి గొప్ప సినిమాలుగా వచ్చాయి. జమిందారీ వ్యవస్థపై తిరుగుబాటు రైతుబిడ్డ సినిమా. ఈ సినిమా నిర్మాత జమీందారైన యార్లగడ్డనే. దీనిపై వెంకటగిరి, బొబ్బిలి సంస్థానాల వారు ఈ సినిమా ప్రింట్లు తగలబెట్టారు. కోర్టు కెళతామని బెదిరించారు. విచిత్రం ఏమంటే చల్లపల్లిలో మాత్రం ఈ సినిమా విడుదల కాకుండా నిర్మాతగా ఉన్న యార్లగడ్డ జాగ్రత్తపడ్డారు. యార్లగడ్డ పెట్టిన మరో సంస్థ ‘‘ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ’’. ఇది నష్టాల్లోకి పోవడంతో భారత్ ఎలక్ట్రానిక్స్ 1982లో దీనిని కొనుగోలు చేసింది. తర్వాత యార్లగడ్డ, ఇతర కమ్మ జమిందార్లు కలిసి ఉయ్యూరులో 1936లో చెరకు ఫ్యాక్టరీని ప్రారంభించారు. రోజూ 800 టన్నుల చెరకు గానుగ చేసేవారు. ఈ గ్రూపులోని పెట్టుబడిదారులే ఒరిస్సాలోని రాయగఢలో మరో సుగర్ ఫ్యాక్టరీ కట్టారు. గోదావరి డెల్టాలోని అనుభవం ఉన్న రైతుల (ఎక్కువ మంది కమ్మవారు)ను వలస రూపంలో తీసుకెళ్లి అక్కడ పెట్టారు. ఉయ్యూరు, రాయగడ యూనిట్లు చివరికి కేసీపీ గ్రూపులో భాగం అయ్యాయి.

కేసీపీ ఎవరిది?

కేసీపీ వ్యవస్థాపకుడు వెలగపూడి రామకృష్ణ. కృష్ణాజిల్లాలో ధనిక కమ్మ వ్యవసాయదారు కుటుంబం నుంచి వచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఇంగ్లండులో ఇంజినీరింగ్ చేసి కొంతకాలం ఆక్స్ ఫర్డ్, లండన్ ఎకనమిక్స్ స్కూల్లో చదువుకున్నారు. అనంతరం ఇండియన్ సివిల్ సర్వీసులో చేరారు. మద్రాసు ప్రభుత్వానికి ఇండస్ట్రీయల్ సలహాదారుగా ఉన్నారు. అప్పటికే నష్టాల్లో ఉన్న ఉయ్యూరు కోపరేటివ్ అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ క్రెడిట్ సొసైటీ (ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ)ను వెలగపూడి రామకృష్ణ కొనుగోలు చేశారు. తర్వాత అంటే 1941లో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. పేరు కేసీపీగా మారింది. రాయగఢ యూనిట్టు జేపోర్ షుగర్ కంపెనీగా మారింది. మాంగనీసు, క్రోమ్ వంటి మైనింగ్ వ్యాపారంలో అడుగుపెట్టింది. తర్వాత స్టీలు ప్లాంట్లలో ఉపయోగించే ఫెర్రో ఎల్లాయ్ తయారీ కర్మాగారాన్ని 1958లో ప్రారంభించారు. చెన్నె సమీపంలో 1955లో భారీ ఇంజినీరింగ్ కంపెనీ- కేసీపీ లిమిటెడ్ ఏర్పాటైంది. షుగర్, సిమెంటు, స్టీలు, పవర్ ప్లాంట్లకు సంబంధించిన హెవీ మెషీనరీని తయారు చేయడం కేసీపీ లిమిటెడ్ చేపట్టింది. మాచెర్ల (గుంటూరు)లో తర్వాత ఒక సిమెంటు ఫ్యాక్టరీ వచ్చింది. శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక పెద్ద కంపెనీ పుట్టింది. గుత్తాధిపత్యంపై ఏర్పాటైన విచారణ కమిషన్ 1965లో ఇండియాలోని తొలి 75 వ్యాపార గ్రూపుల్లో కేసీపీని 44వ స్థానంలో ఉందని చెప్పింది. రూ.13.61 కోట్లు ఆస్తులు ఉండేవి. రూ.10.52 కోట్లు టర్నోవర్ ఉండేది. దీనికి రెండు మెట్లు కింద కోయంబత్తూరుకు చెందిన కమ్మవార్ నాయుడు సామాజిక వర్గానికి చెందిన వి.రంగస్వామి నాయుడు గ్రూపు ఉంది. వెలగపూడి రామకృష్ణ కుమార్తె రాజేశ్వరీని రంగస్వామి నాయుడు కుమారుడు పీ.ఆర్.రామకృష్ణన్ కి ఇచ్చి పెళ్లి చేయడంతో రెండు గ్రూపుల మధ్య చుట్టరికం కలిసింది. వెలగపూడి చనిపోయిన తర్వాత బయట వారి వాటాలను పక్కన బెడితే, అతని ముగ్గురు బిడ్డలకూ కేసీపీ సామ్రాజ్యం విడిపోయింది. 1996లో కేసీపీ లిమిటెడ్ కింద ఉన్న రెండు షుగర్ ఫ్యాక్టరీ (ఉయ్యూరు, లక్ష్మీపురం-చల్లపల్లి)లను వేరుగా చేశారు. ఈ రెండింటి గానుగ సామర్ధ్యం 12 వేల టన్నులుగా ఉంది. ఒకటి కేసీపీ సుగర్స్, రెండోది ఇండస్ట్రీస్ కార్పొరేషన్ గా మారాయి. ఒరిజినల్ కేసీపీ లిమిటెడ్ కింద ఇంజినీరింగ్, సిమెంటు, వీటితోపాటు 2,500 టన్నుల గానుగ సామర్ధ్యం ఉన్న చిత్తూరు జిల్లాలోనూ, వియత్నాంలలో ఉన్న సుగర్ కర్మాగారాలు రెండుగా మారాయి. ఒకటి సుదలగుంట సుగర్స్ గానూ, కేసీపీ వియత్నాం ఇండస్ట్రీస్ గానూ మారాయి. ఇవి వి.ఎల్.దత్తు కిందకు వచ్చాయి.  కేసీపీ సుగర్స్ ను రామకృష్ణ మరో కుమారుడు వి.మారుతీరావు కిందకు వచ్చింది. జైపోర్ సుగర్ కంపెనీ రాజేశ్వరీ రామకృష్ణన్ దగ్గర ఉంది. ఒరిస్సాలో ప్రాథమికంగా మైనింగ్, సుగర్ ఉత్పత్తి రంగాల్లో ఉన్నా.. పశ్చిమ గోదావరి చాగల్లులో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ 8,000 టన్నుల గానుగ సామర్ధ్యంతో దూసుకుపోతున్నది. ఈ ప్లాంటు 1961లో మొదలైంది. డాల్టా నుంచి చెరకు రైతుల్ని తీసుకెళ్లి రాయగఢలో చేసిన ప్రయోగం విఫలమైంది. జైపోర్ సుగర్ మైనింగ్ నుంచి బయటకు వచ్చేసింది. ఫెర్రో ఎల్లాయ్ ఫ్యాక్టరీని జూన్ 2005లో హైదరాబాదుకు చెందిన వీబీసీ గ్రూపు ఎం.ఎస్.రామారావు (ఈయన కూడా కమ్మనే)కు లీజుకు ఇచ్చేశారు.

చెరకు గానుగ కర్మాగారాలను స్థాపించిన మరో ఇద్దరు జమిందార్లు కూడా కమ్మవారే. పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చిన తణుకులో ప్రారంభించిన శ్రీ సర్వారాయ సుగర్స్ ముఖ్యమైంది. ఆంధ్రా సుగర్స్ (బ్రాండు) 1951లో ఉత్పత్తిని ప్రారంభించింది. దీని వ్యవస్థాపకుడు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, అతని బావమరిది పి.ఎస్.ఆర్.వి.కే. రంగారావు. ఇద్దరికీ గోదావరి డెల్టాలో చెరో వెయ్యి ఎకరాల జమీ ఉంది. వెలగపూడి రామకృష్ణ కూడా ఇందులో పెట్టుబడి పెట్టారు. ఫ్యాక్టరీ వ్యవస్థాపనకు సహకరించారు. ఇది కూడా వెయ్యి కోట్ల కంపెనీగా మారింది. పంచదార, రసాయనాలు, ఎరువులు, వనస్పతులు, వస్త్ర పరిశ్రమ రంగాల్లో వ్యాపారం విస్తరించింది. సర్వారాయ సుగర్స్ 4,000 టన్నుల సామర్ధ్యం ఉంది. దీనిని 1959లో కపిలేశ్వరపురం ఎస్టేట్ సభ్యులు ప్రారంభించారు. ఈ కుటుంబం నుంచే కాకినాడలో స్పిన్నింగ్ మిల్లు, సర్వారాయ టెక్స్ టైల్స్ వచ్చాయి. సర్వారాయ టెక్స్ టైల్స్ ఇపుడు మూతబడింది.

(మిగతా పార్ట్ -03లో)

Other Articles

2 Comments

  1. hi!,I like your writing very much! share we communicate more about your post on AOL? I require a specialist on this area to solve my problem. Maybe that’s you! Looking forward to see you.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *