ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ వాయిదా పడవు: ఉదయ భాస్కర్

April 16, 2019 | News Of 9

విజయవాడ: ఏపీపీఎస్సీ పరిక్షాలేవీ ఫాస్ట్ ఫోన్ కావనీ, వీలైనంత త్వరగా అన్ని పరిక్షలూ నిర్వహించి పోస్టులను భర్తీ చేస్తామనీ ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ బాస్కర్ తెలిపారు. పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ ఈ నెల 21 న జరుగుతాయని అన్నారు. ఓఎమ్ఆర్ తరహాలో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందనీ, ఈ ఎగ్జామ్ కు 5 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారనీ ఆయన ఈ సందర్బంగా తెలిపారు.

గత ఏడాది నవంబర్ నుంచి 33 నోటిఫికేషన్లు విడుదల చేశామని ఉదయ భాస్కర్ తెలిపారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే నెలలో విడుదల చేస్తామని చెప్పారు. గ్రూప్ వన్ మెయిన్స్ డిస్కిప్టివ్ తరహాలో ఉంటుంది కనుక ఆఫ్ లైన్లో ఉంటుదన్నారు. మైనింగ్ టెస్ట్ ఆన్లైన్లో జరుగుతుందని ఆయన తెలిపారు. ఈబీసీ రిజర్వేషన్ వల్ల నోటిఫికేషన్ విడుదల చేయడంలో జాప్యం జరిగిందనీ, వచ్చే రెండు నెలల్లో మరో 9 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామనీ తెలిపారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *