మనల్ని తొక్కేందుకే చూస్తారు… !!

June 7, 2019 | News Of 9

Pawan Kalayan | telugu.newsof9.com

  • ప్రజల్లోనే ఉంటూ ముందుకు వెళ్దాం
  • జనసేనాని పవన్ క‌ళ్యాణ్

విజయవాడ: ‘‘సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలతో వెనకడుగు వేసే ప్రసక్తే వద్దు… ప్రజల్లోనే ఉంటూ ముందుకే వెళ్దాం’’ అని జనసేన అధ్యక్షుడు పవన్ క‌ళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే కాదు ప్రతి క్షణం మనం జనంతోనే మమేకమై వారికి ఏ ఇబ్బంది వచ్చినా మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలని అన్నారు.  పశ్చిమ గోదావరికృష్ణా జిల్లాల నుంచి జనసేన తరఫున పోటీ చేసిన లోక్ సభశాసనసభ అభ్యర్థులతో గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులు తమ అనుభవాలనుఫలితాలను ఎలా చూస్తున్నదీ వివరించారు. అనంతరం పవన్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ “ఈ ఫలితాలపై ఎవరికి వారే స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఏదో ఒక ఎన్నికల కోసం వచ్చింది కాదు జనసేన పార్టీ. ఎప్పుడూ జనం పక్షమే ఉండే సిద్ధాంతాలతో నిర్మితమైంది. ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోనే పాతికేళ్ళ లక్ష్యంతో పని చేస్తుంది అని చెబుతుంటాను. ఇప్పుడు వచ్చిన ఓట్లు జనసేనపై బలమైన విశ్వాసం ఉన్నవారి నుంచి వచ్చినవే.  అలాగే మన పార్టీని ఏదో రీతిన అణచి వేయాలని చూస్తూనే ఉంటారు. ప్రజలకు మరో ప్రత్యామ్నాయం ఉండకూడదు అనుకొంటారు. వారిని బలంగా ఎదుర్కోవాలి. నేను ఏ దశలోనూ వెనకడుగు వేసేది లేదు. మనకు జన బలం ఉంది. యువతరం మన వెంట ఉంది. వాళ్లందరినీ కలుపుకొంటూ మరింత బలం పెంచుకోవాలి. అలాగే ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరఫున నియోజకవర్గాల్లో పని చేసేందుకు వచ్చిన ఎన్నారైలుఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకొంటున్న యువత వచ్చింది. వారంతా కమిటెడ్ గా మన కోసం ఉన్నవారు. అలా ఉన్నవారితోనూ మీరంతా ఎప్పటికప్పుడు అనుసంధానం కావాలి. జనసేన పార్టీ నుంచి ఏ విధమైన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్ళాలిక్షేత్ర స్థాయిలో ఎలా బలోపేతం కావాలనే అంశం మీద అన్ని జిల్లాల సమావేశాలు పూర్తయిన తరవాత మీ అందరితో మరోసారి చర్చిస్తాను. ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల కోసం ఏం చేయాలోమౌలిక సదుపాయాలు వారికి అందేలా ఎలా చేయాలో మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. ఎన్నికల ఫలితాల అనంతరం బెదిరింపులుకేసులు అంటూ ఇబ్బందిపెడతారనే భయం వద్దు” అని అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరిశ్రీకాకుళంవిజయనగరం జిల్లాల అభ్యర్థులతో సమావేశం ఉంటుంది.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *