‘3.O’ మూవీ ఎలా ఉండ‌బోతోందంటే..

November 30, 2018 | News Of 9

2.0 Movie Press Meet Photos

ఒకవైపు ఇండియా గర్వించదగ్గ డైరెక్ట‌ర్ శంకర్‌. మరోవైపు ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఇంకోవైపు వరుసగా సోష‌ల్ మెసెజ్ ఓరియంటేడ్ సినిమాల్లో నటిస్తూ.. సక్సెస్‌లో ఉన్న నార్త్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌. ఇవే కాక త్రీడీ, 4డీ సౌండ్‌ సిస్టమ్‌, భారీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇలాంటి ఎన్నో స్పెషాలిటీస్‌తో విడుద‌లైన మూవీ ‘2.ఓ’. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రికార్డు స్థాయి థియేట‌ర్ల‌లో విడుద‌లై సూప‌ర్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాపీసు వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప్ర‌భంజానికి తెర‌లేపుతోంది.

 

ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ శంకర్ రోబో సీక్వెల్స్ ను కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నట్లు వినిపిస్తోంది. శంకర్ ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఇందుకు సంబందించిన ప్రస్తావన వచ్చింది. శంకర్ కూడా తనకు మంచి కాన్సెప్ట్ తడితే వెంటనే కొనసాగిస్తానని వివరణ ఇచ్చాడు. అయితే గత సినిమాలకు భిన్నంగా మినీ రోబోలతో అప్‌క‌మింగ్ 3.O ప్రయోగం చేసేలా ఉన్నాడని తెలుస్తోంది. ఎందుకంటే 2.0 సినిమాలో క్లైమాక్స్ లో సినిమా ఎండ్ అవుతోంది అనగా మినీ రోబోలు 3.O అంటూ సందడి చేశాయి. ఈ ఎపిసోడ్ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో శంకర్ నెక్స్ట్ వెర్షన్ కు ఒక దారినైతే సెట్ చేసుకున్నట్లు చెప్పవచ్చు.

 

ప్రస్తుతం ఈ శంక‌ర్ తన దృష్టిని త‌న అప్‌క‌మింగ్ మూవీ భారతీయుడు-2 పైనే ఉంచాడు. అది పూర్తయి రిలీజవ్వడానికి రెండేళ్ల‌యినా పడుతుంది. ఈ స‌మ‌యంలోనే శంకర్.. 3.0 కథను సిద్ధం చేసుకుంటాడ‌ని తెలుస్తోంది.

 

అయితే ఆ సీక్వెల్ రజినీతో చేస్తారా లేక వేరే వాళ్లను ఉపయోగిస్తారా? అనేది పెద్ద సస్పెన్స్. ఎందుకంటే రజినీకాంత్ 2.0 సినిమా వ‌ర‌కే చాలా అలసిపోయాడు. ఆరోగ్య సమస్యలతో షూటింగ్ లతో ఇబ్బంది పడ్డాడు. మరి శంకర్ 3.O ప్రాజెక్టు కోసం ఏ స్టార్ల‌తో ప్ర‌యోగానికి సిద్ద‌మ‌వుతాడ‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *