తోట రాకతో డీలా పడిన ప్రత్యర్ధి పార్టీలు

February 9, 2019 | News Of 9

Thota a big advantage to JSP in Guntur west

  • గుంటూరు పశ్చిమంలో జోరుగా ఊహాగానాలు
  • టీడీపీ, వైసీపీల్లో హుషారు కరవు

గుంటూరు: మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను గుంటూరు పశ్చిమ నియోజక వర్గ అభ్యర్ధిగా జనసేన ప్రకటించిన దగ్గర్నుంచీ..ప్రత్యర్ధి పార్టీలయిన తెలుగుదేశం, వైఎస్సార్సీపీ గుండెల్లో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వైస్సార్సీపీ అసెంబ్లీ సమన్వయకర్తగా చంద్రగిరి యేసు రత్నం ఉండగా, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే  మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరికీ ఈసారి టికెట్ దక్కడం లేదన్న వార్తలు జోరుగా సాగుతున్నాయి. పార్టీలో ఆశావహులు ఎక్కువ కావడంతో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ ఏ జాబితాలో గతంలో ఐటీ దాడులు జరిగిన కోవెలమూడి రవీంద్ర కుమార్ (బంక్ నాని) , భాష్యం రామకృష్ణ , మన్నవ మోహన కృష్ణ ఉన్నారు. వైస్సార్సీపీ తమ గత ఎన్నికల అభ్యర్థి లేళ్ల తిప్పిరెడ్డిని తొలగించి.. యేసు రత్నం అనే కొత్త అభ్యర్థిని బరిలోకి దించింది. కానీ టిక్కెటు గురించి ఏ విధమైన స్పష్టత ఆయనకు ఇప్పటి వరకూ ఇవ్వలేదు.

నేతల పార్టీ ఫిరాయంపులు, అవినీతి ఆరోపణలు అలవాటుగా ఉన్న ఈ రెండు పార్టీల నేతల మధ్య నిజాయితీ, నిబద్దత ఉన్న ఒక మాజీ ఐఏఎస్ ప్రత్యర్ధి పార్టీలకు చెమటలు పట్టించడం ఖాయమన్న వ్యాఖ్యానాలు నియోజకవర్గంలో సాగుతున్నాయి. జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ గతంలో ఐఏఎస్ గా పని చేసి నాగపూర్, ఠాణే రూపురేఖలు మార్చారు. ముంబయి థారవీలో కూడా ఆయన పని చేశారు. జనసేన అభ్యర్ధిగా చంద్రశేఖర్ ఉన్నందున.. మిగతా పార్టీల నుంచి ఎవరు బరిలోకి దిగినా, మిగతా పార్టీలకి ఈ సీటుపై ఆశలు వదులుకోవాల్సిందేనని రాజకీయ పండితులు చెబుతున్న మాట.

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *