కౌంటింగ్ కేంద్రల వద్ద పటిష్టమైన భద్రత

December 10, 2018 | News Of 9

Image result for security for vote counting in hyderabad

  • విజయోత్సవ సభలకు ,ప్రదర్శనలకు అనుమతి లేదు
  • రాచకొండ సీపీ మహేష్ భగవత్
ఎన్నికల ప్రక్రియ చివరి బాగంగా రేపు రాచకొండ కమీషనరేట్ పరిధిలోని రెండు చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బంది తో సమావేశమై వారితో మాట్లాడారు. రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు.
 మొదటగా వాహనాలు తనిఖీ చేసి పంపించాలని అన్నారు.
 కౌంటింగ్ సెంటర్ల చుట్టూ  బ్యారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే భద్రతా బలగాలు విధులు నిర్వహిస్తారు.
 సీసీ కెమెరాలు, కేంద్ర భద్రతా బలగాలు, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుందన్నారు
 కౌంటింగ్ గురించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగినది పూర్తి నిఘా నీడలో కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుంది
 కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉంది
 రేపు ఓట్ల లెక్కింపు జరుగుతుంది కావున   ఎలాంటి సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు.
 కౌంటింగ్ కేంద్ర లకు పాస్ హోల్డర్స్ కి మాత్రమే అనుమతి ఉందన్నారు.
 కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 7 గంటల లోపు కౌంటింగ్ కేంద్రలకు  చేరుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్ పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని తెలిపినారు.
 కౌంటింగ్ సెంటర్ల లలోకి వచ్చే వ్యక్తులు మొబైల్ ఫోన్స్,వాటర్ బాటిల్స్ ,అగ్గిపెట్టె ,లైటర్,వంటి నిసేధితవస్తువులు వెంట తీసుకురాకూడదు .
 ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేశామన్నారు.
 ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ వారి సూచనలు, సలహాలు పాటించి, ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్  కోరారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *