కోటి ఎకరాలకు నీళ్లిచ్చేదాకా విశ్రమించం: కేసీఆర్

December 11, 2018 | News Of 9

KCR | telugu.newsof9.com

హైదరాబాద్: నమ్మకం ఉంచి, తెరాసకు తిరిగి అధికారాన్ని అప్పగించినందున మరింత జవాబుదారీతనంతో ప్రజల సంక్షేమం కోసం పని చేయాల్సిన గురుతర బాధ్యత తమపై ఉందని, తెలంగాణ నుంచి పేదరికాన్ని పారదోలేందుకు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తామని అన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు అందించే వరకూ విశ్రమించేది లేదని, ఒక పద్ధతి ప్రకారం పని చేసుకుంటూ వెళతామని అన్నారు. పాలమూరుకు ఇప్పటికే నీళ్లు అందుబాటులోకి వస్తున్నాయని, పాలమూరు పచ్చకోక కప్పుకుందని ఒక పాట కూడా రాశామని, అందుకే తమకు గులాబీ కోక కప్పారని చమత్కరించారు. పూర్తి మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కేసీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదన్న అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, తక్షణమే ఎన్ని ఖాళీలు ఉంటే వాటిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తామని అన్నారు. నిరుద్యోగ సమస్య అన్నది ఒక్క మనకే కాదని, అది దేశ వ్యాప్తంగా ఉన్న సమస్య అన్న విషయాన్ని మరిచిపోరాదని అన్నారు. అలాగే ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగాల కల్పనకు కృషి చేద్దామని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను అందరికీ ఇస్తామని, ఇందులో తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎవరూ పేర్లను సిఫార్సు చేయడంలేదని, అధికారులే లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారని అన్నారు. తన నియోజక వర్గంలో కూడా తాను ఎవరి పేర్లనూ సిఫార్సు చేయలేదని గుర్తు చేశారు. అలాగే సొంత స్థలాలు ఉన్న వారికి కూడా ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామని మొన్న చెప్పినందున, ఎలా ఇవ్వాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారని అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *