కడపలో భారీగా ఎస్ఐల బదిలీలు..

February 11, 2019 | News Of 9

Transfers in Kadapa police | telugu.newsof9.com

కడప: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసు శాఖలో బదిలీలు జోరందుకున్నాయి. ఇప్పుడు వైఎస్సార్ కడప జిల్లా వంతు.. జిల్లా వ్యాప్తంగా 44 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ అభిషేక్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. వీరంతా తక్షణమే.. బదిలీ అయిన స్టేషన్ లో రిపోర్ట్ చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు రానున్న తరుణంలో ఈ బదిలీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇవి కాక త్వరలో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *