రోడ్డు ప్రమాదం: గాయపడిన దళిత ఉద్యమకారుడు వినయ్

December 10, 2018 | News Of 9

హనుమాన్ జంక్షన్ (కృష్ణాజిల్లా): కాంగ్రెసు నేత కొరివి వినయ్ కుమార్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కుమార్ తీవ్రంగా గాయపడటంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హనుమాన్ జంక్షన్ వద్ద సోమవారం ఉదయం కొరివి వినయ్ కుమార్ ప్రయాణిస్తున్న కారును ఒక లారీ ఢొన్నది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కాంగ్రెసు పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా ఆయనతోపాటు ప్రయాణిస్తున్నారు. వారంతా ప్రాణాపాయం మంచి బయటపడ్డారు. ఏపీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఫోన్లో నేతల్ని పరామర్శించారు. వినయ్ కుమార్… ఆంధ్ర ప్రదేశ్  కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగానికి ఛైర్మన్ గా ఉన్నారు. దళిత ఉద్యమ నేతగా కూడా ఉన్నారు. గాయపడ్డ వినయ్ కుమార్ ను వెంటనే 108లో స్థానిక పిన్నమనేని ఆసుపత్రికి స్థానికులు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ గా ఉన్నారు. కుమార్ తోపాటు లక్ష్మణస్వామి కూడా స్వల్పంగా గాయపడ్డారు. 

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *