బాల‌య్యకు ఊహించ‌ని షాక్

December 8, 2018 | News Of 9

Unexpected shock for Balayya |Newsof9

టీడీపీకి హిందూపురంలో ఊహించ‌ని షాక్ తగిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీలో 30 ఏళ్లుగా పనిచేసినా ప్రాధాన్యత లేదని ఈ సంద‌ర్భంగా అబ్దుల్ ఘనీ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన నేత‌గా గుర్తింపు ఉన్న‌ అబ్దుల్ ఘనీ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా సినీ నటుడు, నందమూరి బాలకృష్ణ కొన‌సాగుతున్నారు. గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన బాలకృష్ణ… టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి పోటీ చేశారు. ఇక్కడ గెలుపు కోసం ఆయన బాగానే శ్రమించారు. రెండు వారాల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ తరపున బాలకృష్ణపై పోటీ చేసిన నవీన్ నిశ్చల్‌.. ఆయనకు గట్టి పోటీనే ఇచ్చారు. అయితే చివరకు బాలకృష్ణ 16 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బాల‌య్య విజ‌యం వెనుక అబ్దుల్ ఘనీ కృషి కూడా ఉంద‌ని అంటారు. తాజాగా అబ్దుల్ ఘనీ వైసీపీలోకి వెళ్లడంతో 2019 అసెంబ్లీ బ‌రిలో బాల‌య్య‌తో పోటీ ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో హిందూపురంలో టీడీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే టాక్ మొద‌లైంది. ఇంత‌కాలం బ‌ల‌మైన స‌పోర్టుగా ఉన్న అబ్ధుల్ ఘ‌నీ రివ‌ర్స్ గేర్ వేయ‌డం బాల‌య్యకు ఊహించ‌ని షాక్ అనే చెప్పాలి

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *