ఉపసనకు “దాదాసాహెబ్ పాల్కే ఫిలాంత్రఫిస్ట్” అవార్డ్

April 21, 2019 | News Of 9

 

 

Upasana konidela

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనను ఈ యేడాది “దాదాసాహెబ్ పాల్కే ఫిలాంత్రపిస్ట్” అవార్డ్ వరించింది. తన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. భిన్నరంగాలకు చెందిన ప్రతిభావంతులకు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులకు ఈ అవార్డు అందిస్తున్నారు.

తనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. “నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. మంచి పనులు చెయ్యడానికి ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తినిస్తున్న వారికి ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. అన్నివిధాలా నాకు గొప్ప సపోర్ట్ గా నిలుస్తున్న నా కుటుంబానికి కృతజ్ఞతలు” అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్.. ‘ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా’ అంటూ తన భార్య ఉపాసనకు ఫేస్ బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *