ఉర్జిత్ పటేల్ రాజీనామా!

December 10, 2018 | News Of 9

urjit patel | telugu.newsof9.com

న్యూఢిల్లీ : ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఆర్బీఐకీ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య ఘర్షణ పూర్వక వాతావరణం నెలకున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ దగ్గరున్న రిజర్వు నిధులను ఇవ్వాలని కేంద్రం ఒత్తిడి తెస్తుండగా, అందుకు ఊర్జిత్ పటేల్ నిరాకరించారు. మధ్యే మార్గంగా  నిధులను పరిమితంగానే విడుదల చేసేందుకు అంగీకరించినా… ఈ వివాదంతో ఊర్జిత్ పటేల్ విసిగిపోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామ చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.  భారతదేశ రిజర్వు బ్యాంకులో వివిధ పదవుల్లో సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఊర్జిత్ రాజీనామాను విపక్షాలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. మంగళవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున ఆర్బీఐ, సీబీఐ అంతర్గత గొడవలు వంటివన్నీ పార్లమెంటు సమావేశాలను వేడిక్కిస్తాయి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *