సూప‌ర్ స్టార్ సినిమాలో విజ‌య‌శాంతి

March 12, 2019 | News Of 9
mahesh babu | Telugu.news of 9
ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసిన రాజకీయ నాయకురాలు అయింది. ఈ మ‌ధ్యే రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికి 20 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంది ఈ రాముల‌మ్మ‌.
ఇలాంటి స‌మ‌యంలో రాముల‌మ్మ మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. న‌మ్మ‌డానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అన్నీ కుదిరితే విజయశాంతి మ‌రోసారి వెండితెరపై మెర‌వడం ఖాయంగా క‌నిపిస్తోంది. దీనికోసం ఇప్ప‌టికే తెర‌వెన‌క ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. సూప‌ర్ స్టార్ మహేష్ సినిమాతోనే ఈ లేడీ సూప‌ర్ స్టార్ రీ ఎంట్రీ ఇస్తుంద‌ని తెలుస్తుంది. మ‌హేష్ ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు మ‌హేష్.
ఈ మూవీ జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ప‌క్కా అనిల్ రావిపూడి పంథాలోనే ఈ చిత్రం సాగ‌నుంది. ఇందులో మ‌హేష్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించ‌బోతుండ‌గా హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న న‌టిస్తుంది. ఇక ఈ చిత్రంలో ఓ ప‌వ‌ర్ ఫుల్ రోల్ కోసం ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.. విజయశాంతిని సంప్రదించినట్టు తెలుస్తుంది. చాలా రోజుల నుంచి మంచి పాత్ర వ‌స్తే మ‌ళ్లీ న‌టించాల‌ని చూస్తున్న విజ‌య‌శాంతికి అనిల్ చెప్పిన పాత్ర బాగా న‌చ్చేసింద‌ట‌.
అందుకే రాముల‌మ్మ కూడా మ‌హేష్ సినిమాలో న‌టించ‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై పూర్తి వివ‌రాలు బ‌య‌టికి కానున్నాయి. దిల్ రాజుతో క‌లిసి ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌నున్నాడు. మొత్తానికి చూడాలిక‌.. సూప‌ర్ స్టార్ – లేడీ సూప‌ర్ స్టార్ కాంబినేష‌న్ ఎలా ఉండ‌బోతుందో..

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *