వ్యక్తి నడతను చూసి ఓటెయ్యాలి: ఉప రాష్ట్రపతి వెంకయ్య

December 5, 2018 | News Of 9

Vote based on Personality: Venkaiah Naidu | Newsof9

విజయవాడ: రాజకీయ నాయకులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారనీ, రాజకీయా నాయకులు స్థాయి మరచి మాట్లాడటం సరికాదని, ప్రజలకి రాజకీయాలు అంటే అసహ్యం వేసేలా మాట్లాడుతున్నారని, ఒకరికి ఒకరు శత్రువులు కాదనీ, సహేతుకంగా ఉండేలా విమర్శలు చేస్తే బాగుంటుందనీ, వ్యవస్థని అపహాస్యం చేయకండి అని తాను సూచిస్తున్నానని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్టీలు మారటం అనే జాడ్యం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఏ పార్టీ నుండి పదవి వచ్చిందో ఆ పార్టీ మారేటపుడు పదవులు కూడా వదిలి మారండి. ఎన్నికల సందర్భంగా ఇస్తున్న హామీలు ఎలా పడితే అలా హామీలు ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై అవగాహన కలిగి ఉండి మాత్రమే ఎన్నికల హామీలను ఇవ్వాలి’’ అని ఆయన ఉద్భోధించారు. ఓట్లు వేసే సమయంలో కులం, మతం చూడకుండా వ్యక్తి గుణం, నడత, చూసి ఓట్లు వేయాలన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *