ఆత్మకూరులో బయటపడ్డ వీవీ ఫ్యాట్ స్లిప్పులు.. దగ్ధం చేసిన సిబ్బంది

April 16, 2019 | News Of 9

నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గంలోని ఓ బూత్ వద్ద వీవీ ప్యాట్ స్లిప్పులు బయటపడ్డాయి. వాటిని సిబ్బంది వెంటనే తగలబెట్టేశారు. ఈ సంఘటన మీడియాకు చిక్కింది. సంఘటనకు సంబంధించి విచారించిన ఆర్డీఓ అవి మాక్ పోలింగ్ కు సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులని తెలిపారు.
ఈ సంఘటన ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో చోటుచేసుకుంది. అక్కడి 133,134 పోలింగ్ బూత్ లలో బయటపడ్డ వివి ఫ్యాట్ స్లిప్పులు కలకలం సృష్టించాయి.

సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు విచారణ చేపట్టారు. వెంటనే ఆర్డీఓ కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. మాక్ పోల్ జరిగినప్పుడు వివి ప్యాట్ స్లిప్పులు బయట పడి ఉంటాయని అధికారుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాక్ పోల్ సమయంలో బయటకు వచ్చే స్లిప్పులను సీల్ వేసి అధికారులు భద్రపరచాల్సి ఉంది. ఈ విషయం పై ఆర్డీఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *