కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఉద్యోగులకు జీతాలు: పవన్ కళ్యాణ్

April 9, 2019 | News Of 9

 • మా పాలనలో టీచర్లు విద్య చెప్పడానికే పరిమితం
 • రేపు జనసేన ప్రభుత్వమే వస్తోంది
 • కేసీఆర్ 2014లో జగన్ గురించి అలాగే చెప్పారు
 • ఆయన ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు
 • సమాజంలో మార్పును ఎవరూ గుర్తించలేరు.
 • పాలకొల్లు సభలో జనసేనాని

(న్యూస్ ఆఫ్ 9)

రానున్నది జనసేన ప్రభుత్వమేనని, మార్పు రావడాన్ని ఎవరూ గుర్తించలేరని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. 2014లో కూడా జగన్ సీఎం అయిపోతున్నట్లు అందరూ చెప్పారనీ, ఈసారి చంద్రబాబుగానీ, జగన్ కానీ సీఎం కావడంలేదని, జనసేన విజయం సాధిస్తుందని తెలిపారు. ‘‘నేను నా కుటుంబాన్ని నమ్ముకుని రాలేదు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. అన్నీ వదిలేసి వచ్చాను. ఈ దేశానికీ, ఈ రాష్ట్రానికీ సేవ చేయాలనుకుని వచ్చిన వ్యక్తి తనను తాను నిరూపించుకోవడానికి ఇంతకంటే ఏం చేయగలడు?’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. పాలకొల్లులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…. జనసేన ప్రభుత్వం రాగానే… రాష్ట్ర ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని, మధ్యంతర భృతిని కూడా 33 శాతం ఇస్తామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధ్యాయులను పార్టీ పనుల కోసం వాడుకున్నది, ఇది దారుణమని, ఉపాధ్యాయులు చదువులు చెప్పేందుకు మాత్రమే జనసేన ఉపయోగించుకుంటుందని, దీనిపై సంస్కరణల కమిటీని నియమిస్తామని అన్నారు. పొట్టి శ్రీరాములు జన్మదినాన్నే.. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటిస్తామని తెలిపారు.

ప్రతికూల పరిస్థితుల్లో అండగా ఉండేవారికి సలాం కొట్టేస్తానని అంటూ… పరిస్థితులు అనుకూలంగా ఉన్ననాడు అందరూ వస్తారని అన్నారు. స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇవ్వడానికి తమకు అభ్యంతరమేమీ లేదని కేసీఆర్ చెప్పడాన్ని గుర్తుచేస్తూ… అందుకు అయిదేళ్ల సమయం ఎందుకు తీసుకున్నారని అన్నారు. వైసీపీకి మద్దతు ఇవ్వరాదని హితవు చెబుతూ… అవసరమైతే ‘‘చంద్రబాబు విమోచనా సమితి’’ అని ఇక్కడ ఒక పార్టీ పెట్టుకోవాలని అన్నారు. చంద్రబాబు మీద కోపంతో జగన్ కు మద్దతు ఇవ్వడం సరికాదని అన్నారు. ఇంట్లో హత్య జరిగితే వేలి ముద్రలు చెరిపేశారని, అలాంటి వారు రాష్ట్రానికి సీఎం అయితే… ప్రజలకు ఎలాంటి భద్రత లభిస్తుందని ప్రశ్నించారు. తిరుమలకు చెప్పులతో వెళ్లే వ్యక్తి మన సంస్కృతిని ఏ రకంగా రక్షించగలుగుతారని అన్నారు.

జగన్ గెలుస్తాడని కేసీఆర్ గతంలో కూడా చెప్పారని, ఆయన చెప్పినప్పుడల్లా అది జరగడంలేదని, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని అన్నారు. కేసీఆర్ ఒకటి అనుకుంటే… యాదాద్రిదేవుడు కూడా మరొకటి తలుస్తున్నాడని అన్నారు. ఇది కూడా శుభ సూచకమేనని అన్నారు. అల్లా ముందు, యోహోవా ముందు అందరూ తగ్గి ఉండాలి. లేదంటే నరసింహస్వామి స్తంభం నుంచి వచ్చేస్తాడని అన్నారు.

రాష్ట్రంలో ఆడపడుచుల మాన ప్రాణ రక్షణ ఉండాలని అన్నారు పవన్ కళ్యాణ్. అందుకే తాను సామాన్యుడి పక్షాన చేరినట్లు చెప్పారు. కన్నబాబు లాంటి వ్యక్తులు కాపు కులం పేరు చెప్పుకుని, చంద్రబాబు, జగన్ వంటి వారి పల్లకీలు మోస్తాడని విమర్శించారు.

తెలుగుదేశం పార్టీవారు.. భూకబ్జాలు, ఇసుక మాఫియాలతో భూమాతను దోచుకున్నారని, ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీని విసిరి కొట్టేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. స్థానిక వైసీపీ అభ్యర్ధి డాక్టర్ బాబ్జి… మంచివాళ్లేగానీ… వెళ్లి వైసీపీ అనే మురికి నీళ్లలో పడ్డారని, ఇలాంటి వారికి ఏం చెబుతామని అన్నారు. 2014లో తాను లేకపోయి ఉంటే… జగన్ సీఎం అయి మీ అందరినీ పీకలు పట్టుకుని అటు ఇటూ తిప్పుతుండేవాడని ఎద్దేవా చేశారు. కిరాయి మూకల్ని నిర్వహించే వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావాలని అనుకుంటున్నాడని అన్నారు. ఆలోచించి ఓటేయాలని ప్రజలకు విన్నవించారు.

Other Articles

4 Comments

 1. I do agree with all the concepts you’ve presented in your post.
  They are very convincing and will certainly work. Nonetheless, the posts are very brief for starters.
  May just you please prolong them a bit from next time?
  Thanks for the post.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *