ఏపీలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేశాం: ఎన్నికల సంఘం

December 10, 2018 | News Of 9

Voters | telugu.newsof9.com

అమరావతి: ఏపీలో ప్రస్తుతం 3.72 కోట్ల మంది ఓటర్లుండగా, 25 లక్షల ఓట్లను పరిశీలించి, అందులో లక్ష నకిలీ ఓట్లను తొలగించారు. ‘‘ఓటరు జాబితాలపై అపోహలు వద్దు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఆమోదం లేకుండా ఓటు తొలగించడం సాధ్యంకాదు’’ అని  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. వారం పాటు ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించామని, ఓట్ల గల్లంతుపై రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. ఓటర్ల జాబితాను నియోజకవర్గాలుపోలింగ్ బూత్ ల వారీగా పరిశీలించినట్లు తెలిపారు. ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలు సవరించినట్లు వివరించారు. 175 నియోజక వర్గాల్లో ఓటర్ల జాబితా పక్కాగా తయారైందని సిసోడియా వెల్లడించారు. తెలంగాణలో మాదిరిగా ఓట్లు గల్లంతు కాకుండా పక్కాగా చర్యలు తీసుకున్నామని ఆందోళన పడాల్సిన అవసరం లేదని అన్నారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *