తార‌క్‌తో జ‌త క‌ట్టే ఈ అందాల భామ ఎవ‌రో తెలుసా!

March 14, 2019 | News Of 9

Daisy Edgar-Jones | telugu.newsof9.com

టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్టు సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ డీటైల్స్ రివీల్ చేశాడు డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. అల్లూరి సీతారామరాజు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను రామ్‌చరణ్‌, కొమురం భీం పాత్రను ఎన్టీఆర్ చేస్తారంటూ తెలిపాడు. ఆలియా భ‌ట్ చ‌ర‌ణ్‌కు జ‌త‌గా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భ‌ట్ న‌టిస్తోంది. రాజి, ఉడ్తా పంజాబ్, గల్లీ బాయ్.. వంటి హిట్ సినిమాలు చేసి బీ-టౌన్‌లో ఓ వెలుగు వెలుగుతోంది. ప్ర‌స్తుతం త‌న ప్రియుడు రణ్‌బీర్ క‌పూర్‌తో క‌లిసి బ్ర‌హ్మ‌స్త్ర మూవీ చేస్తోంది.

ఇక తార‌క్‌కు జ‌త‌గా డైసీ ఎడ్గార్ జాన్స్  Daisy Edgar-Jones న‌టిస్తోందని రాజ‌మౌళి తెలిపాడు. ఇంత‌కీ ఈ భామ ఎవ‌రంటూ సోష‌ల్ మీడియాలో అంతా వెతుకుతున్నారు. డైసీ హాలీవుడ్ హీరోయిన్. 1997లో కోల్డ్‌ఫీట్, 2018లో వార్ ఆఫ్ ద వ‌ర‌ల్ట్స్, పోన్డ్ లైఫ్.. వంటి సినిమాల్లో న‌టించింది. మొత్తానికి ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో పాటు ఓ హాలీవుడ్ హీరోయిన్‌ను కూడా త‌న సినిమాకు తీసుకుని త‌న ప్రాజెక్టుతో అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నాడు రాజ‌మౌళి.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *