తెలంగాణలో ఎవరికి ఓటు..? 5న వెల్లడించనున్న పవన్

December 3, 2018 | News Of 9

Whom to vote in Telangana?.. Pawan to clarify on Dec 5 | Newsof9

హైదరాబాదు: తెలంగాణ రాష్ట్రంలో 7వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇక్కడున్న జనసేన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ పార్టీకి ఓటెయ్యాలన్న అనుమానం గత కొన్ని రోజులుగా అందరినీ వేధిస్తున్నది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ మేరకు సూచించాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. దీనిపై త్వరలోనే ఏ విషయం చెబుతానన్న పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సోమవారం వివరణ ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన అంటే పోలింగుకు రెండు రోజుల ముందు స్పష్టం చేయనున్నారు.

ప్రజాకూటమి పేరుతో తెలుగుదేశం, కాంగ్రెసు, టీజేఎస్, సీపీఐలు కలిసి పోటీ చేస్తుండగా, తెరాస ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ మొత్తం ఎలాగున్నా కూకట్ పల్లిపై మొత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దృష్టి పెట్టింది. దీని కారణం అక్కడ హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేయడమే. దీంతో కూకట్ పల్లిలో ప్రజాకూటమిని ఓడిస్తే… తెలుగుదేశం పార్టీని ఓడించినంత గొప్పగా భావిస్తున్నారు తెలుగుదేశం వ్యతిరేక ఓటర్లు. కూకట్ పల్లిలో ఉన్న కాపు, మున్నూరు కాపు ఓటర్లు మాత్రం తెరాసకి ఓటు వేయాలని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. తెలుగుదేశాన్ని ఓడించాలన్న కృతనిశ్చయంతో వారంతా కలిసికట్టుగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ని ఆహ్వానించి సంఘీభావ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఏపీలో ఎలాగూ తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించేందుకు జనసేన సిద్ధంగా ఉంది. రాను రానూ జనసేన అక్కడ భారీస్థాయిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నది. రాయలసీమలో మొదటి కవాతుకు ప్రజలు లాక్షలాదిగా హాజరుకావడం జనసేన శ్రేణుల్లో ఎనలేని ఆనందాన్ని నింపింది. రాయలసీమలో కూడా పవన్ కు తిరిగులేదన్న భావన వ్యక్తం అవుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ జనసేన ఇంతై వటుడింతై అన్నట్లు అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉండొచ్చు. రోజు రోజుకీ తెలుగుదేశం అప్రతిష్ఠను మూటగట్టుకుంటూ జనానికి దూరం అవుతోంది.

సరే, తెలంగాణ విషయంలో జనసేన వ్యూహం ఎలా ఉండొచ్చు? రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెసు పార్టీని మరో ఆరేళ్లపాటు ఎన్నికల నుంచి బహిష్కరించమని ఆంధ్రలో పవన్ ఇప్పటికే పిలుపునిచ్చారు. తెలుగుదేశానికి అసంభవం. ఉన్న అవకాశం తెరాసకి మాత్రమే. కానీ లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో జనసేన బరిలోకి దిగుతున్నందున అప్పుడు తెరాసతో పోటీ పడాల్సి ఉంటుంది. సో, డైరెక్టుగా సమర్ధించడమూ కష్టమే. కర్రవిరగకుండా, పాము చావకుండా మాట్లాడే విధానం మరి పవన్ డిక్షనరీలో లేదు. బాస్ ఎలా చెబుతారో ఎవరం ఊహించలేం అని ఒక జనసేన అభిమాని వ్యాఖ్యానించింది కూడా నిజమే. అయినా ఒక ప్రయత్నం చేద్దాం.

ప్రయారిటీ ప్రకారం పవన్ ప్రకటన ఇలా ఉండొచ్చు:

1. గతంలో కేసీఆర్ పాలన బాగుంది అని కితాబునిచ్చారు కాబట్టి, అసెంబ్లీ వరకూ తెరాసకు మద్దతు ప్రకటించవచ్చు.
2. ఆంధ్రలో ఉన్న పోటీ మీకు తెలుసు కదా. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు.
3. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నదీ నిర్ణయం జరిగిపోయింది కదా.. మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో నాకు తెలుసులే అంటూ తెరాసకు పరోక్షంగా మద్దతు పలకవచ్చు.
4. ఆత్మ ప్రబోధం అనవచ్చేమోగానీ.. ఇందుకు అవకాశం చాలా తక్కువ అనిపిస్తోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *