‘‘పోసాని’’ నోట అంత మాట ఎందుకు వచ్చింది…?

March 22, 2019 | News Of 9

Posani Krishna Murali | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

తెలుగు రాష్ట్రాల్లోని మీడియా సంస్థలు అప్రతిష్ఠను మూటగట్టుకుంటున్నాయి. ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ… వంటివన్నీ యల్లో మీడియా… చంద్రబాబుకు తొత్తులు… కులాలకూ, ఆ కులాల వెనుక ఉన్న రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారాయి… ఇలాంటి విమర్శలు ఇపుడు తరచూ వినిపిస్తున్నాయి. ఎందుకు?

నటుడు, సంభాషణల రచయిత పోసాని కృష్ష మురళి మొదటి నుంచీ బోళామనిషి. కాస్త విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన సినిమా డైలాగులు కూడా అలాగే ఉంటాయి. ఆయన మాన్యుఫాక్చరింగ్ అలా ఉంది. కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడతారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో.. ఆయన ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు. ఆ విరుచుకుపడటం మామూలు స్థాయిలో లేదు. రాధాకృష్ణ జర్నలిజం చేయడంలేదని, వ్యభిచారం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. ఈ గోలంతా.. పోసాని ఎన్నికల నేపథ్యంలో తీస్తున్న ఒక సినిమా వల్ల వచ్చింది. ఈ సినిమాలో చంద్రబాబు ప్రతిష్ఠను మంటగలుపుతూ తీస్తున్నారని అనుమానించిన తెలుగుదేశం పార్టీ ఈ సినిమాని ఆపివేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరింది. దీనిపై వారు పోసానికి నోటీసు ఇస్తే, తనకు ఆరోగ్యం బాగాలేదని పోసాని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే.. బుధవారం రాత్రి పోసాని గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ ఒక అసత్య కథనాన్ని ప్రసారం చేసిందన్నది పోసాని కడుపు మంటకు కారణం.

దీనిపై పోసాని ఉదయమే విలేకరుల సమావేశం పెట్టి రాధాకృష్ణపై విరుచుకుపడ్డారు. తిట్టని తిట్టులేదు.. ‘‘అబద్ధపు వార్తలు వేస్తావా.. రాధాకృష్ణా’’ అంటూ ఆయన ఇష్టంవచ్చినట్లు మాట్లాడారు. పోసాని ఏం తిట్టారన్నది విషయం కాదుగానీ… అసలు మీడియా ఎందుకు ఇంత దారుణంగా ప్రజల దృష్టిలో తయారైంది అని చాలా మందికి ఒక సందేహం ఉన్నది. పోసానిలా కడిగేయాలన్న కసి చాలా మందికి ఉంటుందికానీ… అందరూ ఆ పని చేయలేక పోసాని మన తరఫున తిడుతున్నాడులే అనుకుని సంతృప్తి పడుతుంటారు. అసలు మీడియా ఇలా అప్రతిష్ఠను మూటగట్టుకోవడానికీ, యల్లోమీడియా అని తిట్లు తినడానికీ కారణాలు ఏమిటో తెలసుకుందాం. మరి జర్నలిస్టులు ఏమీ చేయరా? చేయలేరా? ఇవ్వాళ టీవీల్లో గొంతు చించుకుని మాట్లాడేందుకు ప్రయత్నించే వారికి పూర్తి స్వేచ్ఛ ఉందా? ఇవన్నీ తెలియాలంటే… ఒక్కసారి మీడియా సంస్థల లోపలికి వెళ్లి చూడాలి.

జర్నలిజం స్వాతంత్ర్య ఉద్యమకాలంలో పుట్టింది. అందువల్ల పాత్రికేయులకు పెద్దగా జీతాలు ఉండేవికావు. అప్పట్లో దీనిని ఒక పవిత్రమైన కార్యంగా పరిగణించేవారు. ఉప్పు పట్టిన చొక్కాతో వారానికి ఒక రోజు కూడా చొక్కా మార్చుకోకుండా ఒక సిద్దాంతం కోసం నిబద్ధతతో పని చేసిన పాత్రికేయులు లేరని కాదు.. అప్పట్లో మాత్రమే ఉన్నారు. యజమానులకు ఎడిటోరియల్ విషయాలతో సంబంధం ఉండేదికాదు. నేషనల్ హెరాల్డ్ నెహ్రూ యజమాని. ఆయన ఒకసారి ఆఫీసుకు వస్తే… ‘‘గెట్ లాస్ట్ ఇక్కడ యజమానులకు ఏం పని?’’ అని ఎడిటర్ కోటంరాజు రామారావు అంటే.. నెహ్రూ మౌనంగా ఇంటికి వెళ్లిపోయారు. అది ఆనాటికాలం. ఇపుడు మీడియా సంస్థలకు వాటి యజమానులే చీఫ్ ఎడిటర్లుగా ఉండటం పెద్ద విషాదం.

ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి గొప్ప జర్నలిస్టులు ఎందరో వచ్చారు. కోటంరాజు రామారావు, సీవై చింతామణి ఇంగ్లిషు పత్రికల్లో పని చేసిన తెలుగువారే. తాపీ ధర్మారావు, కోటంరాజు రామారావు, సీవై చింతామణి, జి.కృష్ణ, మూట్నూరి కృష్ణారావు, నీలంరాజు శేషగిరిరావు, జీకేరెడ్డి ఇలా ఎందరో మహానుభావులు…. అయితే అనంతర కాలంలో విలువలు పతనమైపోవడం మొదలై… అది నేటికీ కొనసాగుతున్నది. అన్ని రంగాల్లో మాదిరిగానే ఈ పతనానికి మీడియా మినహాయింపు కాదు. వ్యాపార ధోరణి మీడియాలో ఇపుడు ఎంత ఎక్కువైపోయిందో మీకు తెలుసు. ఒకప్పుడు ఎడిటర్లకు నెలకు 200 రూపాయలు జీతం ఉంటే గొప్ప. ఇపుడు లక్షల్లో చెల్లిస్తున్నారు. జాతీయ స్థాయి ఇంగ్లిషు న్యూస్ ఛానెళ్లలో అయితే సాలీనా అయిదారు కోట్ల పైమాటే. వ్యాపార ధోరణి పెరిగిన తర్వాత… యజమానులకు అనుకూలంగా ఉండే సీనియర్ పాత్రకేయులకూ జీతాలు పెరిగాయి. మీడియా యజమానులు ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం ఏనాడో మొదలైంది. పార్టీలకు అనుకూలంగా రాయడం ద్వారా… చాలా మంది మీడియా యజమానులు రాజకీయ పదవులను సంపాదించుకున్నారు. ఉదాహరణకు.. పాత ఆంధ్రజ్యోతి (రాధాకృష్ణకు ముందు) యజమాని కెఎల్ఎన్ ప్రసాద్, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ మీడియా సంస్థ యాజమాని టి.చంద్రశేఖరరెడ్డి, వార్త దినపత్రిక యజమాని గిరీష్ సంఘీ… వీళ్లంతా రాజ్యసభ సభ్యులు అయ్యారు. అంటే ఆయా పార్టీలకు మీడియా యజమానులు అనుకూలంగా పని చేసినందునే వారికి రాజకీయ పదవులు లభించాయన్నది మనకు తెలుస్తూనే ఉంది. అలాగే ఉదయం యజమానిగా ఉన్న దాసరి నారాయణరావు కూడా రాజ్యసభకు వెళ్లారు. అలాగే ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మీడియా యజమానులు కూడా రాజ్యసభ సభ్యత్వాలను తీసుకున్నారు. పేరు మోసిన జర్నలిస్టు, రచయిత కుష్వంత్ సింగ్ కూడా కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా వార్తలు రాసినట్లు స్వయంగా తన ఆత్మకథలో పేర్కొన్నారు. సంజయ్ గాంధీ ఉన్నపుడు అప్పటి మారుతీ ఉద్యోగ్ కంపెనీకి సంబంధించి ఆరోపణలు వస్తే గాంధీ కుటుంబానికి దీనికీ సంబంధం ఏమీ లేదని కుష్వంత్ రాశారు (ఇటస్ట్రేటెడ్ వీక్లీలో అనుకుంటాను). దీనికి నజరానాగా కుష్వంత్ హిందూస్థాన్ టైమ్స్ పత్రిక (బిర్లాలు దీనికి యజమానులు)కు చీఫ్ ఎడిటర్ అయ్యారు. అలాగే తర్వాత కాంగ్రెసు కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఆయన యుకే హైకమిషనర్ గా కూడా పని చేశారు. ఇవన్నీ సంజయ్ గాంధీ సిఫార్సుతో లభించినవే.

ఈనాడు యజమాని రామోజీరావుకు కూడా రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిందిగా ఆఫర్లు రాకపోలేదు. కానీ ఆయన ఆ ఆఫర్లను తిరస్కరించారు. కారణం ఏమీ లేదు.. రామోజీరావు ‘‘కింగ్’’ గా ఉండటం కంటే… ‘‘కింగ్ మేకర్’’ గా ఉండటానికే ఎప్పుడూ ఇష్టపడతారు. భారతదేశంలో ఇపుడు ప్రైవేటు రంగ పెట్టుబడిదారులు వేల కోట్ల సామ్రాజ్యాలను నిర్వహిస్తున్నారని మీకు తెలుసు కదా. వారి సామ్రాజ్యాలతో పోల్చితే…ఆర్థికపరంగా మీడియా సంస్థల సామ్రాజ్యాలు ఎప్పుడూ చిన్నవే. అందువల్ల బడా వ్యాపారులు మీడియాను చాలా తేలికగా తమ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. అవసరమైన డబ్బు పడేస్తే మీడియా తోక ఊపుకుంటూ చెప్పిన పని చేస్తుందని వారికి తెలుసు. లేదూ.. పింగళి దశరథరాంలా మొండిగా ఉంటే కష్టం. చంపేస్తారు. ఇలాంటివి వ్యక్తులు అరుదు. అలాంటి వారు ఇప్పుడున్నా… ఏ ఇసుక లారీయే ఢీకొట్టి పోతుంది.

జర్నలిస్టులు కూడా డబ్బు కోసమే పని చేస్తున్నారు. మీడియా యజమాని ఏం చెబితే అది చెయ్యాలి, చేస్తారు. ఎవరికి మద్దతు పలుకుతూ టీవీలో ‘‘చిలక పలుకులు’’ పలకమంటే నోరు మూసుకుని పాత్రికేయుడు ఆ పని చేస్తాడు. నువ్వు చెయ్యకపోతే మరొకరు ఆ పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరో 10 వేల జీతం కంపెనీకి మిగులుతుంది. చివరికి నెలకు 20 వేల రూపాయలకే ఒక టీవీ ఛానెల్ లో సీఈవోగా పని చేస్తున్నారని విన్నాను. 20 ఏళ్ల అనుభవం ఉన్న జర్నలిస్టుకు అంత తక్కువ జీతం ఇచ్చారని కాదు. ఏం చెప్పినా యజమానే కరెక్టు అనే ఒక జూనియర్ అన్నమాట. జూనియర్లయితే నోరెత్తకుండా పని చేసుకుంటూపోతారు.

జర్నలిస్టులు నిజాయితీపరులనీ, సమాజాన్ని చీల్చి చెండాడేస్తారనీ, ప్రపంచంలో ఎవరినీ లెక్కచేయని నిప్పులాంటి జర్నలిస్టులు ఉంటారనీ ప్రజల్లో ఒక మూఢ నమ్మకం పాతుకుపోయింది.

దీనిపై సీనియర్ జర్నలిస్టు ఒకరిని అడగ్గా ఆయన ఇలా అన్నారు. ‘‘సాక్షి దిన పత్రిక ను ఉదాహరణగా తీసుకుందాం. సాక్షి యజమాని జగన్ ఏపీ రాష్ట్రానికి సీఎం కావాలని అనుకుంటున్నారు. అందుకోసం సొంత పత్రిక, టీవీ పెట్టుకున్నారు. ‘‘సాక్షి’’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా కె.రామచంద్రమూర్తి పని చేస్తున్నారు. ఆయన తెలంగాణ (ఖమ్మం) జిల్లాకు చెందిన వారు. బ్రాహ్మణ సామాజిక వర్గం. గతంలో ఆయన రాథాకృష్ణ నేతృత్వంలోని ఆంధ్రజ్యోతిలో ఎడిటర్ గా పని చేశారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడ ఉంటే చంద్రబాబుకు అనుకూలంగా రాయాల్సిందే. సాక్షిలో ఉన్నారు కాబట్టి… చంద్రబాబుకు అక్షింతలు వేస్తూ… జగన్ ను సీఎం కావాలంటూ ఆశీర్వదిస్తారు. వృత్తి అనండి.. మరొకటి అనండి ఇది వాస్తవం. వార్తలో ఉన్నపుడు గిరీష్ సంఘీకి అనుకూలంగా రాసి ఉంటారని తేలికగానే ఊహించవచ్చు. ఏబీకే ప్రసాద్ అనే మరో సీనియర్ ఎడిటర్ కూడా ‘‘సాక్షి’’లో ప్రత్యేక వ్యాసాలు రాస్తారు. ఇవి చంద్రబాబుకు వ్యతిరేకంగానూ, జగన్ కు అనుకూలంగానూ వస్తుంటాయి. ఆయనది చంద్రబాబు సామాజిక వర్గమే. అయినా ఆయన జగన్ ను ఎందుకు సమర్ధిస్తూ రాస్తారు? డబ్బులు కావచ్చు. అదే సాక్షిలో ఒక బీసీ పాత్రకేయుడు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు… జగన్ రెడ్డిని సీఎం చేయడానికే వీళ్లంతా పని చేస్తూ ఉంటారు. ఇదే నేటి నిజం, ఇదే నేటి మీడియా’’ అని వ్యాఖ్యానించారు.

యాజమాన్యం లక్ష్యమే జర్నలిస్టుల లక్ష్యం అయిపోతుంది. ప్రపంచం ఎటుపోనీ.. యజమాని కోసం యజమానికి ఉన్న పార్టీ కోసం పని చేయడమే కర్తవ్యం అయిపోతుంది. జర్నలిజం పరంగా… ఇందులో ప్రజల కోసం పని చేయడం ఎక్కడ ఉంది? ప్రజల కోసం పని చేయడం అన్నది మీడియా సంస్థలకు ఏ కోశానా లక్ష్యంగా లేదన్నది వాస్తవం. కాకపోతే ప్రజలు మాత్రం పత్రికలు తమ కోసమే ఉన్నాయని అనుకుంటారు. అది భ్రమ.

పాత్రికేయుల కులాలు ఏవైనా… వీటన్నింటికీ అతీతంగా ‘‘సాక్షి’’లో ఉన్నవారంతా యజమాని జగన్ రెడ్డిని ‘‘సీఎం’’ చేసే దిశగా పగలూ, రాత్రీ పని చేస్తున్నారు. మీడియా సంస్థల యజమానులు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే అందులో పని చేస్తున్న వారంతా నోరు మూసుకుని యాజమాన్యం చెప్పినట్లు చేసుకునిపోవాలి. లేదంటే గేటు బయట నిలబడాలి.

ఈనాడు దినపత్రికలో ఒకసారి సమ్మె జరిగితే ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పేరుపై నిషేధం ఉండేది. ఏ జర్నలిస్టు కూడా రంగనాయకమ్మ అన్న పేరు ఈనాడు దినపత్రికలో ఎక్కడా కనిపించరాదు. ఇది అలిఖిత శాసనం. అలాగే కొంత కాలం దాసరి నారాయణరావుపైనా ఈనాడు నిషేధం విధించిందికానీ… తర్వాత మళ్లీ సయోధ్య కుదిరింది.

మీడియా సంస్థల్లో… పాత్రికేయులు ఇలా బహుకృత వేషం వేయకపోతే… జర్నలిస్టు ఇంట్లో పెళ్లాం బిడ్డలు పస్తులు ఉండాల్సి వస్తుంది. అందువల్ల మీడియా ఒక్క దానిలోనే విలువలు లేవని అనుకోవడం సరికాదు. పతనం అన్నది 360 డిగ్రీల్లో అన్ని వ్యవస్థల్లోనూ ఉంది. పెట్టుబడిదారుల వ్యాపార ప్రయోజనాల కోసం మీడియా సంస్థలే కాదు… రాజకీయాలూ, అధికార వ్యవస్థలూ అన్నీ ఆ విషవలయంలో చిక్కుకుపోయాయి.

పెట్టుబడిదారీ సమాజం తన చుట్టూ ఉన్న అన్ని వ్యవస్థలని తనకు అనుకూలంగా మార్చుకుని కాలి కింద తొక్కిపెట్టి ఉంచుతుంది. మీడియా ఆ కాలి బొటన వేలి కింద ఉంటుంది. అందువల్ల ప్రస్తుతానికి మీడియాను లాభాపేక్ష కలిగిన ఒక వ్యాపారం అనుకుంటే ఎవరికీ చింత ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ కు మీడియా ఎందుకు ప్రచారం ఇవ్వదు అంటే… ఆయా మీడియా సంస్థలకు ఎవరి స్వప్రయోజనాలు వారికి ఉన్నాయి. చంద్రబాబు, అతని చుట్టూ ఉన్న పెట్టుబడిదారుల వద్ద లక్షల కోట్లు ఉన్నాయి. దేనినైనా క్షణాల్లో లొంగదీసుకోవడం వారికి చిటికెలో పని. అందుకే అనేక మీడియా సంస్థలు ‘‘బాబు మళ్లీ మళ్లీ మళ్లీ రావాలి’’ అని కోరుకుంటాయి. చంద్రబాబును పేదల పెన్నిధిగా కీర్తిస్తాయి.  ఎన్నికల సమయంలో అనేక మీడియా సంస్థలు… రాజకీయ పార్టీల దగ్గరకు వెళ్లి ప్యాకేజీలు తెచ్చుకుంటాయి. చంద్రబాబుగానీ, వైఎస్ సీఎంగా ఉన్నపుడు కూడా ఇదో పెద్ద ప్రహసనంగా సాగింది. ఈ మధ్య అమెరికన్ దినపత్రిక ‘‘వాషింగ్టన్ పోస్టు’’ తొలిపేజీ మాస్ట్ హెడ్ (పత్రిక పేరును ఇలా పిలుస్తారు) కింద.. Democracy Dies in Darkness” అని పెట్టింది. నాలుగు పదాలే గానీ… కొండంత అర్థం అందులో ఉంది. 

పోసాని కృష్ణ మురళి… ఇంత బాహాటంగా తిట్టగిలిగాడంటే దానికి వెనుక ఉన్న సాహసం ఇదే. కృష్ణ మురళిని ఎవరు ఏం చేయగలరు? అందులోకి.. పోసాని సామాజిక వర్గం… తెలుగు మీడియా అధిపతుల సామాజిక వర్గం ఒకటే. వాళ్లు ఇవ్వరు కాబట్టి… సాక్షి దీనిని ప్రసారం చేసింది. ఇవన్నీ నేటి సామాజాన్ని గుప్పిట పట్టి ఆడిస్తున్న సామ్రాజ్యవాదులు, మీడియా ఆడుతున్న వింత నాటకం.

ఏ వ్యవస్థ అయినా పూర్తిగా కుళ్లిపోయిన తర్వాత ఎవడో ఒకడు వస్తాడు. వాడిని చరిత్రే పంపుతుంది. ఛీ ఛీ ఛీ అని 90 శాతం మంది ప్రజలు దేని గురించి అనుకున్నా.. ఆ వ్యవస్థ అతి త్వరలోనే మారిపోతుంది. రాజకీయాల గురించి ఎందరో ఇలా తిట్టుకుంటూ ఉంటారు. అందుకే పవన్ కళ్యాణ్ నేను ఉన్నాను అంటూ వచ్చేశాడు. మార్పు తప్పకుండా వస్తుంది. ముందు రాజకీయాలు మారతాయి. రేపు మీడియా వ్యవస్థ కూడా మారుతుందోమో.. మీ అభిమానాన్ని కూడా పొందుతుందేమో..!! ఎప్పుడూ మారనది ఒకటి ఉంది.. అది మార్పు!!

 

Other Articles

21 Comments

 1. I think this is one of the most significant info for me.
  And i’m glad reading your article. But should remark on some
  general things, The web site style is ideal, the articles is really great :
  D. Good job, cheers

 2. I’m curious to find out what blog system you happen to be utilizing?
  I’m having some small security problems with my latest site and I’d like to find
  something more safe. Do you have any solutions?

 3. My partner and I stumbled over here different website and thought I might check things out.
  I like what I see so now i am following you. Look forward to looking at your web page yet again.

 4. Simply desire to say your article is as amazing.
  The clearness in your post is simply great and i can suppose
  you’re a professional on this subject. Well together with your permission allow me to take hold of your RSS feed
  to stay up to date with forthcoming post. Thank you a million and please carry
  on the enjoyable work. natalielise plenty of fish

 5. Thanks for one’s marvelous posting! I quite enjoyed reading it,
  you can be a great author.I will ensure that I bookmark your blog
  and will eventually come back at some point. I want to encourage one to continue your great job, have a nice
  afternoon!

 6. May I just say what a comfort to find a person that
  actually understands what they’re talking about
  online. You actually realize how to bring an issue to light and make it important.
  More people really need to look at this and understand this side of the story.
  I was surprised you aren’t more popular since you definitely possess the gift.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *