తార‌క్ ఎందుకు ప్ర‌చారం చేయ‌డం లేదు?

December 1, 2018 | News Of 9

Why Jr.NTR isn't campaigning for Suhasini?? | news of 9

తెలంగాణ ఎన్నిక‌ల్లో కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి హ‌రికృష్ణ కూతురు సుహాసినిని టీడీపీ త‌రుపున ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు రంగంలోకి దించ‌డంతో అంద‌రి దృష్టి ఈ స్థానంపైనే ప‌డింది. సుహాసినీ త‌రుపున ప్ర‌చారం చేయ‌డానికి ఆమె సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కూక‌ట్‌ప‌ల్లిలో ప్రచారం చేస్తార‌ని అంతా భావించారు. బాల‌కృష్ణ కూడా షూటింగ్ షెడ్యూల్ టైమ్ చూసుకుని ప్ర‌చారం చేస్తార‌ని చెప్పాడు. కానీ ఇంత‌వ‌ర‌కు ఎన్టీఆర్ ప్ర‌చారానికి వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణమెంట‌నే విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

తన తండ్రి నందమూరి హరికృష్ణ చనిపోయినపుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వారి అంత్యక్రియలకు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ప్ర‌భుత్వాలాంచ‌నాల‌తో దగ్గరుండి జరిపించారు. మరి అలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌చారానికి వెళ్లి మ‌ళ్లీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్నే విమర్శించాల్సిన పరిస్థితి వస్తుందని తారక్ ఆలోచన అని అంటున్నారు. అంతేకాకుండా తన అప్‌క‌మింగ్ సినిమా షూటింగ్ కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్న సమయంలో వేరే ఏ ఇతర విషయాల జోలికి వెళ్ళకూడదు అని కూడా బలంగా నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు గ‌తంలో తెలుగుదేశం త‌రుపున‌ ప్రచారం చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు కూడా తారక్ దృష్టిలో పెట్టుకొని తన సోదరి కోసం కూడా ఎన్నికల ప్రచారానికి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండాలని ప్రయత్నిస్తున్నాడ‌ని తెలుస్తోంది. త‌న సోద‌రిని గెలిపించాల‌ని నామినేష‌న్ వేసిన రోజే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అంత‌వ‌ర‌కేగానీ ప్ర‌చారానికి ప్ర‌త్యేకంగా వెళ్ల‌డం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *