అద్దం: నేటి రాజకీయాల్లో కమ్మ, రెడ్డి ఆధిపత్యం ఎందుకు?

January 28, 2019 | News Of 9

నేటి తరం రాజకీయాల్లో… సామాజిక సమానత్వం (సోషల్ జస్టిస్) ఎందుకు లేదు? కమ్మ, రెడ్డి సామాజిక వర్గం వారే రాజకీయాలను ఎందుకు శాసించలుగుతున్నారు? ఇలా జరగడం వెనుక.. చారిత్రక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకుంటే… కాపులు, బీసీలూ,దళితులు, ముస్లింలు ఎందుకు వెనకబడిందీ అర్థం అవుతుంది. పేదల పార్టీగా ప్రారంభమైన… ‘జనసేన’- ఈనాడు డబ్బున్న బాబుల రాజకీయాలకు ప్రత్యామ్నాయం ఎందుకు అవుతుందో చెప్పడానికి ఒక తాత్విక భూమిక దొరుకుతుంది. ఒక సమాధానం దొరుకుతుంది. జనసేనను బలోపేతం చేయడానికి కేవలం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం ఒక్కటే సరిపోదని గుర్తించండి. ‘‘మాకు రాజ్యాధికారమే కావాలి.. మీరు పడేసే బిస్కెట్లు వద్దు’’ అని ధైర్యంగా చెప్పగలుగుతారు. పది మందినీ చైతన్య పరచగలుగుతారు. బడుగు వర్గాల్లో కేవలం దళితులకు మాత్రమే జరుగుతున్న దోపిడీ గురించి చక్కటి అవగాహన ఉంది. మిగిలిన వర్గాలకు అవగాహన లేదు. అవగాహన ఉంటే… డబ్బున్న వారి గుమ్మాల దగ్గర పడిగాపులు కాస్తూ పారేసే నాలుగు గింజల కోసం వారు ఎదురు చూడరు.

మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రహస్యాలను ఎప్పటికీ మీకు చెప్పదు. ఒక మార్పును ఆశించే మీడియాగా ‘‘న్యూస్ ఆఫ్ 9’’ ఈ కథనాలను మీకు అందిస్తోంది. ఇది జరిగిన, జరుగుతున్న చరిత్ర కాబట్టి, కమ్మ, రెడ్డితోపాటు బడుగు సామాజిక వర్గాలకు చెందిన యువకులకు దీనిపై అవగాహనలేకపోవచ్చు. అందరికీ ఒక అవగాహన ఉండటం మంచిదే కదా!! నేటి నుంచి సిరీస్ ప్రారంభం. (అద్దం అబద్ధం చెప్పదు. అందుకే న్యూస్ ఆఫ్ 9- ‘అద్దం’ అనే సెక్షనులో ఇలాంటి అనేక కథనాలు ఉన్నాయి).

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *