యాత్ర, మ‌హానాయ‌కుడు ర‌స‌వ‌త్త‌ర సినీరాజ‌కీయం

February 12, 2019 | News Of 9

NTR Digital will be released on Yathra's release date | telugu.newsof9.com

టాలీవుడ్‌లో సినీ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. వైఎస్సార్ బ‌యోగ్ర‌ఫి యాత్ర మూవీ హిట్ టాక్ తెచ్చుకుని రోజురోజుకు వ‌సూళ్లు పెంచుకుంటోంది. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండానే వ‌చ్చిన  ఈ సినిమా వారం రోజుల్లోనే సేఫ్ జోన్ కు వెళ్ల‌డం ఖాయ‌మైపోయింది. వైఎస్సార్.. ఇటు ఎన్టీఆర్ ఇద్ద‌రి బ‌యోపిక్స్ ఓకేసారి రావ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇప్పుడు యాత్ర విజ‌యం సాధించ‌డం బాల‌య్య‌పై ఒత్తిడి పెంచేస్తోంది. రాజ‌కీయాలే ప్ర‌ధాన ల‌క్ష్యంగా వ‌చ్చిన యాత్ర‌కు మంచి టాక్ వ‌చ్చింది.

ఇప్పటికే ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు వ‌చ్చి డిజాస్ట‌ర్ అయిపోయింది. అయితే దీన్ని యాత్ర‌తో పోల్చి చూడ‌లేం. మ‌హానాయ‌కుడుతోనే యాత్ర‌కు పోటీ.. ఎందుకంటే ఇందులోనే ఎన్టీఆర్ రాజ‌కీయాల‌న్నీ ఉంటాయి. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి చివ‌ర్లో విడుద‌ల చేస్తామ‌ని చెబుతున్నారు కానీ అప్పుడు కూడా వ‌చ్చేది క‌ష్ట‌మే అనిపిస్తోంది. మ‌హానాయ‌కుడు రాక‌పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు యాత్ర సినిమాకు టాక్ బాగా రావ‌డంతో మ‌హానాయ‌కుడు సినిమాపై ఒత్తిడి మరింత పెరుగుతుంది.

వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల‌ను గుర్తుకుతెచ్చిన యాత్ర సినిమా వైఎస్ఆర్సిపీకి బాగానే ప‌నికొచ్చేలా క‌నిపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో టిడిపి ఆశ‌ల‌న్నీ మ‌హానాయ‌కుడు సినిమాపైనే ఉన్నాయి. దానికి తోడు బాల‌య్య త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై కూడా కాస్త కోపంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. యాత్ర‌ను వైఎస్ఆర్సిపీ భుజాన వేసుకుని న‌డిపిస్తే.. క‌థానాయ‌కుడును గాలికి వ‌దిలేసార‌ని బాధ ప‌డుతున్నాడట‌ బాల‌య్య‌. మొత్తానికి ముఖ్య‌మంత్రుల స‌మ‌రంలో వైఎస్ఆర్ మెప్పించాడు.. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఏం చేస్తాడ‌నేదే టాక్ ఆఫ్ ది టౌన్.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *