యాత్ర మూవీ రివ్యూ

February 8, 2019 | News Of 9
చిత్రం: యాత్ర
నటీనటులు: మమ్ముట్టి, రావు రమేష్, సుహాసిని తదితరులు
బ్యానర్ : 70 ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : మహి వి రాఘవ్
ఛాయాగ్రహణం: సత్యన్ సూర్యన్
సంగీతం: కె
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
విడుదల: ఫిబ్రవరి 8, 2019
రేటింగ్: 3.5/5
Yatra Movie Review | telugu.newsof9.com
మాజీ ముఖ్యమంత్రి, దివంగత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ప్రధాన కధాంశంగా, ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో 70 ఎం ఎం ఎంటెర్టైమెంట్స్ వారు నిర్మించిన చిత్రం యాత్ర. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.
మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో నటిస్తున్నారు అని తెలిసినప్పటినుండి ఈ చిత్రం మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందా ? లేక కథానాయకుడు చిత్రం మాదిరి నిరాశ పరిచిందా అనేది తెల్సుకుందాం.
కథ :
వై.ఎస్.ఆర్. పాదయాత్రనే మెయిన్ గా తీసుకున్నారిందులో. వై,ఎస్.ఆర్ (మమ్ముట్టి) హై కమాండ్ ను కాదని పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేయడం. పార్టీకి చెప్పకుండానే పాదయాత్ర చేయడం… చివరికి హై కమాండ్ దృష్టిలో పడడం… ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం… ఆయన మరణం…. ఇదీ యాత్రలో చూపించిన మెయిన్ అంశాలు. ఇందులో ఆయన పాదయాత్ర సందర్భంగా చాలా పథకాల్ని ప్రకటించారు. ఆ పథకాలు ప్రకటించడానికి ఆయన్ని కదిలించిన అంశాల్ని దర్శకుడు ఎంచుకున్నాడు.
నటీనటులు:
వై ఎస్ ఆర్ పాత్రలో మమ్ముట్టి తన వంద శాతం అందించాడు. వై ఎస్ ఆర్ ని అనుకరించగలిగే సత్తా ఉంది కూడా ఆ గొప్పనాయకుడికి గౌరవం ఇచ్చి మమ్ముట్టి ఆ ప్రయత్నం చేయలేదంటే అయన ఆ పాత్రకి ఎంత గౌరవం ఇచ్చి నటించారో అర్ధం చేస్కోవచ్చు.   ఆయన రియల్ లైఫ్ లో ని సోల్ ని పట్టుకున్నారు. తనదైన ఎక్స్ ప్రెషన్స్, డైలాగ్ డెలివరీతో పాత్రకు ప్రాణం పోశాడు. మిగతా నటుల గురించి చెప్పుకోవడడానికి ఎం లేదు అంటే అది వారి పాత్రా పరిధి ఏ మాత్రం కాదు. అది కేవలం మమ్ముట్టి అంత తానే అయ్యి చిత్రాన్ని నడిపిన విధానం మాత్రమే. ఈ విషయం లో డైరెక్టర్ మహి కి మార్కులు ఇవ్వాల్సిందే.
రావు రమేష్ కే వి పి రామచంద్ర రావు పాత్రలో నటించి ఆ పాత్రకి తగిన న్యాయం చేసారు. ఇక అనసూయ, పోసాని, సుహాసిని తదితరులు వారి వారి పాత్రల మేరకు నటించారు.
సాంకేతిక వర్గం:
 మహి వి రాఘవ ఎలాంటి కాంట్రవర్శీలకు వెళ్లకుండా జాగ్రత్తగా స్క్రిప్ట్ రచన చేశాడనిపించింది. ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా మెయిన్ గా యాత్రనే కొనసాగించాడు. ప్రతీ సీన్ ను ఎమోషల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.  అధిష్టానానికి వ్యతిరేకంగా ధైర్యంగా వైఎస్ఆర్ ఎలా ముందుకు వెళ్లాడో చాలా బాగా చూపించాడు. పాదయాత్ర సందర్భంగా రైతు ఆత్మహత్య, వృధ్దుల ఫించన్, ఆరోగ్య శ్రీ ఇలా చాలా పథకాలకు నాంది పలికాడు. ఈ పథకాలు ప్రకటించే ముందు కూడా అధిష్టానానికి చెప్పకుండానే చేశాడు. ఆ తర్వాత వారిని ఒప్పించాడు. వైఎస్ఆర్ పేదల కష్టాల్ని ఎలా తెలుసుకున్నాడో చూపించాడు. ఆ కష్టాల్ని చూసిన తర్వాత తన పంథాను కూడా మార్చుకున్నాడు. ఇవన్నీ దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ గురించిన సీన్స్ ని తెలివిగా హ్యాండిల్ చేశాడు.
గెలిచే అవకాశం లేని పార్టీని ఎలా గెలిపించాడనేది మెయిన్ థీమ్ గా చూపించారు. పాదయాత్ర సమయంలో ఎదురయ్యే సంఘటనల్ని అధ్భుతంగా మలిచాడు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యా ప్రయత్నం, సెకండాఫ్ లో ఒక్క రూపాయి డాక్టర్ సీన్ అద్భుతంగా ఉంది. భావోద్వేగాన్ని నింపేశాడు. ప్రజల గుండెల్లో కొలిచే మహానేతగా ఎలా ఎదిగాడో చూపించాడు. సామాన్యుడి కష్టాల్ని చూపించాడు కాబట్టి ప్రతీ ప్రేక్షకుడు కనెక్ట్ అవుతారు. ఓ పార్టీ సినిమాగా కాకుండా జనరలైజ్ చేసి చూపించాడు. ముఖ్యంగా రైతు బాధల్ని బాగా చూపించాడు. ఎవరైనా ఈ సీన్స్ కు కనెక్ట్ అవుతారు. పాదయాత్ర ప్రభావం రాష్ట్ర రాజకీయాల్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో చూపించాడు.
ఆ సమయంలో పెంచల్ దాస్ పాడిన పాటను బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వేశారు. వైఎస్ఆర్ మరణించినప్పటి విజువల్స్ చూస్తే కంట్లో నీళ్లు రాకుండా ఉండవు.  డైలాగ్స్ సైతం చాలా బాగా రాశారు. ఆలోచించే విధంగా రాశారు. “నీళ్ళుంటే క‌రెంటు వుండ‌దు.. క‌రెంటు వుంటే నీళ్ళుండ‌వు..రెండూ ఉండి పంట చేతికొస్తే స‌రైన ధ‌ర వుండ‌దు. అంద‌రూ రైతే రాజంటారు..స‌రైన కూడు గూడు గుడ్డ నీడ లేని ఈ రాచ‌రికం మాకొద్ద‌య్య‌.. మ‌మ్మ‌ల్ని రాజులుగా కాదు క‌నీసం రైతులుగా బతకనివ్వండి’ అలాగే “నేను విన్నాను నేను వున్నాను’ ఇలాంటి డైలాగ్స్ కి క్లాప్స్ పడ్డాయి. ఈ తరహా ఎమోషనల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి.
సంగీత దర్శకుడు ‘కె’ అద్భుతమైన నేపథ్యం సంగీతం సమకూర్చాడు. అలాగే పాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. సందర్భానుసారంగా వచ్చే పాటలు సినిమా కథను ఎక్కడా డిస్ట్రబ్ చేయకుండా సాగాయి. వీటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది.  సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది.. నిర్మాతలు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
బాటమ్ లైన్ : ప్రతి సినీప్రేమికుడు అనుభవించాల్సిన ఎమోషనల్ “యాత్ర” ఇది

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *