ఈయనకు లెక్కలు రాకే.. ఆయన ఫెయిలు!!

April 19, 2019 | News Of 9

Your failure in math, made him too failed!! | telugu.newsof9.com

(న్యూస్ ఆఫ్ 9)

వైసీపీ ఎంపీ… విజయసాయి రెడ్డికి లెక్కలు రావని తేలిపోయింది. ఆయన ఈ మధ్య రాస్తున్న ట్వీట్లను చూసిన తర్వాత ఇలాంటి నమ్మకమే కలుగుతోంది. ఆయనకు లెక్కలు వచ్చి ఉంటే… అసలు జగన్ అడ్డంగా దొరికిపోయి ఉండేవారు కాదుగా…. జన సైనికుల్లో ఇలాంటి జోకులే పేలుతున్నాయి.

జనసేన సొంతంగా 136 సీట్లలోనూ, బీఎస్పీ 21 సీట్లలోనూ, వామపక్షాలు 14 సీట్లలోనూ మొత్తం 171 సీట్లలో జనసేన కూటమి పోటీ చేస్తే కేవలం 65 సీట్లలో జనసేన పోటీ చేసిందని విజయసాయిరెడ్డి జోకులు పేల్చడంలో అర్థం ఏమిటో తెలియదు. జనసేనకు 88 సీట్లు వస్తాయంటూ జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన మాటల్ని కిండల్ చేసేందుకు తప్ప.. ఇందులో ఆయన సాధించింది ఏమీ కనిపించడం లేదు. ఆయన పెట్టిన ట్వీటును ఈ కింద చూడవచ్చు.   

‘‘సొంతంగా పోటీ చేసిందే 65 సీట్లలో. పవన్ కళ్యాణ్ అనుంగు అనుచరుడు జెడి లక్ష్మీనారాయణేమో 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జోస్యం చెబుతున్నాడు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాసాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’’

వైసీపీ సొంత దినపత్రిక సాక్షికి చెందిన వెబ్ సైటులో చూసినా జనసేన అభ్యర్థుల జాబితా స్పష్టంగా ఉంది. జనసేన కూటమి అభ్యర్థులు 172 మందికి సంబంధించిన పేర్లూ అందులో ఉన్నాయి. మరి 65 సీట్లలోనే జనసేన పోటీ చేసిందని ఆయన ఎలా చెబుతున్నారో ఆ భగవంతుడికే తెలియాలి. విజయసాయి రెడ్డి ట్వీట్లను చూసి జన సైనికులు నవ్వుకుంటున్నారు. హాస్యానికే అలా అన్నారని అనుకున్నా… మే 23 తర్వాత ఫలితాలు చూసిన తర్వాత కూడా ఇలా జోకులు వేయగలిగే అవకాశం విజయసాయిరెడ్డికి ఉండాలి కదా. అది ముఖ్యం మాస్టారూ!!

Other Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *