వైఎస్ వివేకాది హత్యేనని నిర్ధారణ!

March 15, 2019 | News Of 9

    ys vivekananda reddy | Telugu.news of 9

  • దర్యాప్తు చేస్తున్నామన్న కడప ఎస్పీ

 కడప: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డిది హత్యేనని పోలీసులు ధ్రవీకరించారు. వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా హత్యే అని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. వివేకా శరీరంపై ఏడు పదునైన కత్తి గాయాలు, నుదిటిపై రెండు లోతైన గాయాలుతల వెనుక మరో గాయం, తొడ భాగంలో ఒక గాయంచేతిపై మరో గాయం ఉన్నాయి. హత్యా స్థలంలో ఫింగర్ ప్రింట్స్ దొరికాయనీ, వాటి ఆధారంగా దర్యాప్తు చేపడతామని కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఈ హత్య పై సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒంటి మీద ఏడు కత్తి పోట్లు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో కొన్ని క్లూస్ దొరికాయనీ, హత్య జరిగినట్లు భావిస్తున్నామని అన్నారు. నిన్న రాత్రి 11.30 నుండి గంటల వరకు ఎం జరిగిందో ఆరా తీసేందుకు ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు.

Other Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *